Share News

రీల్స్ పిచ్చికి నిలువెత్తు నిదర్శనమంటే ఇదే.. ఈమె డాన్స్ చూస్తే..

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:47 PM

ఓ మహిళ వినూత్నంగా రీల్స్ చేయాలనే ఉద్దేశంతో చివరకు డేంజరస్ స్టంట్స్ చేయాలని నిర్ణయించుకుంది. రైలు పట్టాల పక్కన సైకిల్ నిలబెట్టారు. దాన్ని ముందు వైపు ఓ వ్యక్తి పట్టుకుని నిలబడగా.. వెనుక వైపు సైకిల్‌పై సదరు మహిళ నిలబడింది. అంతటితో ఆగకుండా..

రీల్స్ పిచ్చికి నిలువెత్తు నిదర్శనమంటే ఇదే.. ఈమె డాన్స్ చూస్తే..

ప్రస్తుతం ఆడా, మగా తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరికీ రీల్స్ పిచ్చి పట్టుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాగైనా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. పల్లెల్లో పని చేసుకునే వారి దగ్గర నుంచి పట్టణాల్లో జాబ్ చేసే వారి వరకూ అందరూ నెట్టింట్లో ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏదోటి చేసి నెటిజన్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రన్నింగ్ రైలు పక్కనే సైకిల్‌పై నిలబడి ఎలా డాన్స్ చేస్తుందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వినూత్నంగా రీల్స్ చేయాలనే ఉద్దేశంతో చివరకు డేంజరస్ స్టంట్స్ చేయాలని నిర్ణయించుకుంది. రైలు పట్టాల పక్కన సైకిల్ నిలబెట్టారు. దాన్ని ముందు వైపు ఓ వ్యక్తి పట్టుకుని నిలబడగా.. వెనుక వైపు సైకిల్‌పై సదరు మహిళ నిలబడింది. అంతటితో ఆగకుండా దానిపై డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంతలో ఓ రైలు అటుగా దూసుకొచ్చింది.


అయినా ఆమె ఏమాత్రం భయపడకుండా సైకిల్‌పై డాన్స్ చేస్తూనే ఉంది. అటూ, ఇటూ ఊగుతూ డాన్స్ చేసే క్రమంలో (Woman dancing while standing on bicycle) ఓ దశలో కిందపడబోయింది. అయితే అంతలోనే మళ్లీ నిలదొక్కుకుంది. అప్పటికీ ఆపకుండా అలాగే డాన్స్ చేస్తూనే ఉంది. రైలు వెళ్తున్న సమయంలో ఏమాత్రం అదుపు తప్పినా.. దాని కింద పడే ప్రమాదం ఉంది. అయితే అదృష్టవశాత్తూ ఏమీ కాకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ ప్రజలకు ఇంటి ప్రమాదకరమైన ఆలోచనలు ఎక్కడి నంచి వస్తాయి’.. అంటూ కొందరు, ‘ఏమాత్రం అటూ, ఇటూ అయినా.. రీల్స్ చేయడానికి నువ్వు ఉండవు’.. అంటూ మరికొందరు, ‘ఇలాంటి స్టంట్స్ చాలా ప్రమాదం.. ఎవరూ ఇలా చేయకండి’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి ఈ వీడియో 120కి పైగా లైక్‌లు, 8 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌‌ను ఎలా మార్చారో చూడండి..

ఇలాంటి చోరీ ఎక్కడైరా చూశారా.. ఈ దొంగ నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 14 , 2026 | 01:53 PM