Share News

వాటర్ హీటర్‌తో వింత ట్రిక్.. గ్యాస్ లేదని ఇలా ఎవరైనా చేస్తారా..

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:25 AM

ఓ వ్యక్తి గిన్నెలో కూరగాయలు వేసి, కూర చేసేందుకు సిద్ధమయ్యారడు. గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ పెట్టాల్సిన సమయంలో గ్యాస్ అయిపోయింది. దీంతో చివరకు అతను తన బుర్రకు పదును పెట్టాడు. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..

వాటర్ హీటర్‌తో వింత ట్రిక్.. గ్యాస్ లేదని ఇలా ఎవరైనా చేస్తారా..

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా రోజురోజుకూ ఎల్‌పీజీ సిలిండర్ల కొరత తీవ్రంగా పెరిగిపోతోంది. మరోవైపు గ్యాస్ దొరక్కపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. కొన్నిచోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ సమయంలో గ్యాస్ సమస్యకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సాధారణ వాటర్ హీటర్‌తో చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గిన్నెలో కూరగాయలు వేసి, కూర చేసేందుకు సిద్ధమయ్యారడు. గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ పెట్టాల్సిన సమయంలో గ్యాస్ అయిపోయింది. దీంతో చివరకు అతను తన బుర్రకు పదును పెట్టాడు. నీళ్లు వేడి చేసుకోవడానికి వాడే వాటర్ హీటర్‌ను తెచ్చి.. కూర గిన్నెలో పెట్టాడు. స్విచ్ ఆన్ చేయగానే హీటర్ వేడి కావడం వల్ల కూర ఉడికింది.


ఇలా చూస్తుండానే గిన్నెలోని కూరగాయలన్నీ (man cooked vegetables with water heater) ఉడికిపోయాయి. ఇలా గ్యాస్ లేదా విద్యుత్ స్టవ్‌పై చేయాల్సిన కూరను ఇతను.. వాటర్ హీటర్ సాయంతో చేసేశాడు. ఇది పాత వీడియో అయినా ప్రస్తుతం గ్యాస్ సమస్య కారణంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.., ‘ఇలాంటి ప్రయోగాలు చేయకండి.. ఇలా చేయడం ఎంతో ప్రమాదం’.., ‘ఇలా చేస్తే కాలేయం వంద శాతం పోవడం ఖాయం’.., ‘ఇతడికి ఆసుపత్రి నుంచి 99 కంటే ఎక్కువ మిస్డ్ కాల్స్ వచ్చి ఉండాలి’.., ‘ఈ కూర మొదటిసారి కాదు, ఇదే చివరిసారి’.., ‘ఇండక్షన్ స్టవ్ కొనండి, ఇలా చేయకండి’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 36.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌‌ను ఎలా మార్చారో చూడండి..

ఇలాంటి చోరీ ఎక్కడైరా చూశారా.. ఈ దొంగ నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 14 , 2026 | 11:25 AM