Share News

వేదికపై వరుడిని చూసి బోరున విలపించిన వధువు.. వీడియో వైరల్..

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:46 PM

పెళ్లి మండపంలో వధువు వేదికపైకి వస్తుంది. అక్కడ అప్పటికే వరుడు నిలబడి ఉన్నాడు. అయితే వరుడి ముఖం చూడగానే.. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న వధువు మొఖం ఒక్కసారిగా మారిపోయింది. వధూవరులు ఇద్దరూ ఒకే సోఫాపై..

వేదికపై వరుడిని చూసి బోరున విలపించిన వధువు.. వీడియో వైరల్..

పెళ్లి అంటేనే సంతోషాలు, సంబరాలతో కూడుకున్నది. అయితే ఇటీవల జరిగే పెళ్లిళ్లలో షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తున్నాం. కొందరు వీడియోల కోసం వింత వింత ప్రయోగాలు చేస్తుండగా.. మరికొన్నిసార్లు అనుకోకుండా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వధువుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వరుడిని చూడగానే ఓ వధువు తెగ ఏడ్చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘అయ్యో.. ఈ వధువుకు పెద్ద కష్టమే వచ్చిందిగా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పెళ్లి మండపంలో వధువు వేదికపైకి వస్తుంది. అక్కడ అప్పటికే వరుడు నిలబడి ఉన్నాడు. అయితే వరుడి ముఖం చూడగానే.. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న వధువు మొఖం ఒక్కసారిగా మారిపోయింది. వధూవరులు ఇద్దరూ ఒకే సోఫాపై కూర్చోగానే ఆమెకు ఒక్కసారిగా ఏడుపు పొంగుకొస్తుంది. మరోసారి వరుడిని చూసి బోరున విలపిస్తుంది.


వరుడు నల్లగా ఉండడమే ఇందుకు కారణంగానే కనిపిస్తోంది. వధువు ఏడవడం చూసి (Bride crying after seeing groom) పక్కన ఉన్న ఆమె స్నేహితులు ఓదార్చారు. అయినా వధువు మాత్రం ఏడుస్తూనే ఉంది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇదంతా కావాలని చేశారో.. లేక నిజంగానే ఆమె ఏడ్చిందో తెలీదు గానీ.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పెద్దలు కుదిర్చిన సంబంధంలా ఉంది.. ముందే చూసుకోవాలి కదా’.. ‘పెళ్లి చేసే ముందు అమ్మాయి ఇష్టాఇష్టాలను అడిగి తెలుసుకోవాలి’.., ‘అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేయకూడదు’.., ‘పెళ్లిళ్లలో ఇలాంటి సీన్లు సర్వసాధారణం.. తర్వాత అంతా సర్దుకుంటుంది’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4000వేలకు పైగా లైక్‌లు, 8 లక్షలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌‌ను ఎలా మార్చారో చూడండి..

ఇలాంటి చోరీ ఎక్కడైరా చూశారా.. ఈ దొంగ నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 14 , 2026 | 01:54 PM