గ్యాస్ లేదని ఎలక్ట్రిక్ స్టవ్ కొన్నాడు.. తీరా కూర ఉడికే ముందు చూసి ఖంగుతిన్నాడు..
ABN , Publish Date - Mar 15 , 2026 | 10:39 AM
గ్యాస్ సిలిండర్ల సమస్య కారణంగా ఓ వ్యక్తి తన ఇంట్లో ఎలక్ట్రిక్ కుక్కర్‌పై కూర చేశాడు. కూరగాయలు వేసి ఉడికించాడు. అయితే మధ్యలో అనుమానం వచ్చి టెస్టర్ సాయంతో స్టవ్‌ను టెస్ట్ చేయగా షాకింగ్ సీన్ కనిపించింది..
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్ భారత్‌పై ఏ మేరకు ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రధానంగా గ్యాస్ కొరతతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చాలా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా అనేక మంది ఎలక్ట్రిక్ స్టవ్‌లను వాడుతున్నారు. అయితే వీటిని వాడే క్రమంలో కొందరు అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ స్టవ్‌పై కూర చేశాడు. అయితే మధ్యలో దాన్ని పరిశీలించి షాక్ అయ్యాడు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గ్యాస్ సిలిండర్ల సమస్య కారణంగా ఓ వ్యక్తి తన ఇంట్లో ఎలక్ట్రిక్ కుక్కర్‌పై కూర చేశాడు. కూరగాయలు వేసి ఉడికించాడు. అయితే మధ్యలో అనుమానం వచ్చి టెస్టర్ సాయంతో పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది. టెస్టర్ పెట్టి చూడగా.. స్టవ్‌కు విద్యుత్ పాస్ అవుతున్నట్లు కనిపించింది. అలాగే కూరలో పెట్టి చూసినా టెస్టర్ వెలిగింది.
స్టవ్‌తో పాటూ కూర గిన్నెకు కూడా కరెంట్ పాస్ (Man cooks curry on an electric stove) అవుతోందని గుర్తించాడు. ‘మాకు గ్యాస్ దొరక్కపోవడంతో, ఎలక్ట్రిక్ స్టవ్ కొన్నాం. దానికి ఇలా విద్యుత్ ప్రవహిస్తోంది’.. అని చెబుతూ.. ఆ వ్యక్తి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోపై ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
‘వామ్మో ఏంటిదీ.. ఇలాంటి సమస్య కూడా ఉంటుందా’.., ‘మీ ఇంటి వైరింగ్‌లో లోపం ఉంది.. ఎర్తింగ్ సరి చేయండి’.., ‘ఎలక్ట్రిక్ స్టవ్‌లు వాడే ముందు జాగ్రత్తగా ఉండాలి’.., ‘మంచి బ్రాండెడ్ స్టవ్‌లు వాడాలి’.. అంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 89 వేలకు పైగా లైక్‌లు, 3.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌ను ఎలా మార్చారో చూడండి..
ఇలాంటి చోరీ ఎక్కడైరా చూశారా.. ఈ దొంగ నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..