అరెరే ఇలా జరిగిందేంటీ.. ఈ దొంగ ఎలా దొరికాడో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:36 PM
ఓ వ్యక్తి దుకాణం బయట నిలబడి ఉన్నాడు. అంతా అతన్ని చూసి.. ముందు కస్టమర్ అని అనుకున్నారు. కొద్ది సేపు దుకాణం బయట నిలబడ్డ అతను.. ఆ తర్వాత మెల్లిగా లోపలికి వచ్చాడు. లోపలి వచ్చే సమయంలో ఏం జరిగిందో మీరే చూడండి..
దొంగతనానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. చోరీ చేసే సమయంలో దొంగలు ఎంతో తెలివిగా వ్యవహరించడం చూస్తుంటాం. కొందరైతే పక్కనే ఉంటూ చాకచక్యంగా చోరీ చేసేస్తుంటారు. అయితే కొన్నిసార్లు దొంగలకు షాకింగ్ అనుభవాలు ఎదురవుతంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ దుకాణంలోకి దోపిడీ చేయడానికి వచ్చాడు. తీరా లోపలికి వెళ్లే ముందు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియా ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి దుకాణం బయట నిలబడి ఉన్నాడు. అంతా అతన్ని చూసి ముందు కస్టమర్ అని అనుకున్నారు. కొద్ది సేపు దుకాణం బయట నిలబడ్డ అతను.. ఆ తర్వాత మెల్లిగా లోపలికి వచ్చాడు. లోపలి వచ్చే సమయంలో తన జేబులోని తుపాకీ బయటికి తీసి, దుకాణ యజమానిని బెదిరించాలని చూశాడు. అయితే లోపలికి వచ్చే క్రమంలో అదుపు తప్పి ధబేల్‌మని కిందపడిపోయాడు. దీంతో అతడి చేతిలోని తుపాకీ ఎగిరి దూరంగా పడిపోయింది.
అతను పడిపోవడం చూసి ఆ దుకాణ యజమాని.. ఉలిక్కిపడ్డాడు. ఇంతలో దూరంగా పడిపోయిన తుపాకీని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన చేతిలోకి తీసుకున్నాడు. తుపాకీని దొంగ వైపు గురిపెట్టి తప్పించుకోకుండా చూశాడు. తుపాకీని చూడగానే అతను దొంగ అనే విషయం వారికి అర్థమైంది. వెంటనే దుకాణ యజమాని.. ఆ వ్యక్తిని పట్టుకుని (Shop owner catches thief) మెడ వంచి అక్కడే నిలబెట్టాడు. ఇంతలో అక్కడున్న వారంతా గుమికూడారు. ఇంతటితో ఈ వీడియో ముగిసింది.
ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకున్నట్లు వీడియో ఆధారంగా తెలుస్తోంది. కానీ దీన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ దొంగకు అనుభవం లేనట్లుంది’.. అంటూ కొందరు, ‘ఈ దొంగ ఇంకా ట్రైనింగ్ పూర్తి చేసుకోలేదు’... అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా లైక్‌లు, 8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌ను ఎలా మార్చారో చూడండి..
ఇలాంటి చోరీ ఎక్కడైరా చూశారా.. ఈ దొంగ నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..