Share News

వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..

ABN , Publish Date - Mar 15 , 2026 | 02:42 PM

ఓ ఏనుగు జనావాసాల్లో బీభత్సం సృష్టించింది. అంతటితో ఆగకుండా ఓ వ్యక్తిపై సడన్‌గా దాడి చేసింది. చూస్తుండగానే.. అతన్ని బంతిలా గాల్లోకి విసిరేసింది. ఆ తర్వాత తొండంతో..

వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..

ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఏనుగులు ఎంత శాంతంగా కనిపిస్తాయో.. ఇంకొన్నిసార్లు అంతే స్థాయిలో బీభత్సం సృష్టిస్తుంటాయి. మరికొన్నిసార్లు ఏకంగా మనుషులపై కూడా దాడి చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఏనుగు వ్యక్తిపై క్రూరంగా దాడి చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఏనుగు జనావాసాల్లో బీభత్సం సృష్టించింది. అంతటితో ఆగకుండా ఓ వ్యక్తిపై సడన్‌గా దాడి చేసింది. చూస్తుండగానే అతన్ని బంతిలా గాల్లోకి విసిరేసింది. ఆ తర్వాత తొండంతో నేలకు అదిమిపట్టి, మళ్లీ గాల్లోకి విసిరేసింది. ఏనుగు దాడి చేయడాన్ని (Elephant attack on man) గమనించిన స్థానికులు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. రాళ్లతో దాన్ని దూరంగా తరిమికొట్టేందుకు ప్రయత్నించారు.


ఎంత కొట్టినా కూడా ఆ ఏనుగు ఏమాత్రం కదలకుండా.. ఆ వ్యక్తిపై దాడి చేస్తూనే ఉంది. ఇలా చాలా సేపు ఆ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేసింది. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఏనుగులు చాలా వరకూ కారణం లేకుండా దాడి చేయవట. అలాగే వాటికి చాలా అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుందట. ప్రదేశాలు, మనుషులను ఒక్కసారి చూస్తే మర్చిపోవట. దీన్నిబట్టి ఈ వ్యక్తిపై దాడి చేయడం వెనుక కూడా ఏదో ఒక కారణం ఉండొచ్చని పలువురు అంటున్నారు.


మొత్తానికి ఈ ఏనుగు వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఏనుగు ఇంత క్రూరంగా దాడి చేయడం ఇప్పుడే చూస్తున్నాం’.. అంటూ కొందరు, ‘ఏనుగు ఇంత దారుణంగా దాడి చేసిందంటే.. ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి ఈ వీడియోను 11 వేల మందికి పైగా లైక్‌ చేయగా.. 2.8 మిలియన్లకు పైగా వీక్షించారు.


ఇవి కూడా చదవండి..

గ్యాస్ లేదని ఎలక్ట్రిక్ స్టవ్ కొన్నాడు.. తీరా కూర ఉడికే ముందు చూసి ఖంగుతిన్నాడు..

వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌‌ను ఎలా మార్చారో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 15 , 2026 | 03:15 PM