Share News

ఫోన్ నంబర్ తీసుకుని వ్యక్తి దారుణం.. అసభ్య మెసేజ్‌లు పంపుతూ..

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:55 PM

ఓ వ్యక్తి బ్యాంక్ ఉద్యోగినితో తప్పుగా ప్రవర్తించాడు. అసభ్య మెసేజ్‌లు పంపుతూ వేధించాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

 ఫోన్ నంబర్ తీసుకుని వ్యక్తి దారుణం.. అసభ్య మెసేజ్‌లు పంపుతూ..
Bengaluru obscene messages case

బెంగళూరు, మార్చి 15: ఓ వ్యక్తి బ్యాంక్ ఉద్యోగినితో తప్పుగా ప్రవర్తించాడు. అసభ్య మెసేజ్‌లు పంపుతూ వేధించాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన 40 ఏళ్ల ఆ మహిళ భారతీయ స్టేట్ బ్యాంక్ కంచరకనహళ్లి బ్రాంచ్‌లో సీనియర్ అసోసియేట్‌గా పని చేస్తోంది. మార్చి 10వ తేదీన కేఆర్ రవి శెట్టి అనే వ్యక్తి బ్యాంక్‌కు వచ్చాడు. బ్యాంకింగ్ సేవల గురించి ఆమెతో మాట్లాడాడు. ఈ నేపథ్యంలోనే ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు.


ఆ రోజు రాత్రి 8 గంటల సమయంలో రవి ఆమెకు అసభ్య మెసేజ్‌ పంపాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. అయినా అతడు తన ప్రవర్తన మార్చుకోలేదు. ఆమెకు అసభ్య మెసేజ్‌లు చేస్తూ వేధించసాగాడు. బాధితురాలు అతడి వేధింపుల గురించి మరుసటి రోజు బ్యాంక్ చీఫ్ మేనేజర్‌కు చెప్పింది. ఆయన రవికి ఫోన్ చేశాడు. విషయం గురించి ఆరా తీశాడు. తాను తప్పు చేశానని, బ్యాంక్ దగ్గరకు వచ్చి ఆమెకు క్షమాపణ చెప్తానని రవి బదులిచ్చాడు.


అయితే, అదే రోజు సాయంత్రం 5.20 గంటల ప్రాంతంలో మరో సారి బాధితురాలికి అసభ్య మెసేజ్ పంపాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రవిపై కంప్లైంట్ చేసింది. పోలీసులు రవిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతడి కోసం గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

ఏలూరు జిల్లా కైకలూరులో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రారంభించిన మంత్రి టీజీ భరత్

Updated Date - Mar 15 , 2026 | 06:26 PM