Share News

ఏలూరు జిల్లా కైకలూరులో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రారంభించిన మంత్రి టీజీ భరత్

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:55 PM

ఏలూరు జిల్లా కైకలూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార‌శుద్ధి మంత్రి టీజీ భరత్, స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌తో కలిసి ఘనంగా ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..

ఏలూరు జిల్లా కైకలూరులో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రారంభించిన మంత్రి టీజీ భరత్
Arya Vysya Kalyana Mandapam Kaikaluru

ఏలూరు, మార్చి15: ఏలూరు జిల్లా కైకలూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార‌శుద్ధి మంత్రి టీజీ భరత్(TG Bharat), స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌తో(Kamineni Srinivas) కలిసి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం, భవన ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి రూ.5 కోట్లతో అద్భుతంగా నిర్మించారని కొనియాడారు.


ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ..‘ఆర్యవైశ్యులు అనగానే సేవా, మంచితనం గుర్తుకు వస్తాయి. అన్ని వసతులతో సర్వాంగ సుందరంగా కళ్యాణ మండపాన్ని నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కారణాలతో భవన నిర్మాణం మూడేళ్ల పాటు నిలిపివేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులతో గూగుల్ వంటి దిగ్గజ సంస్థలను ఆహ్వానిస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలతో పోలిస్తే, ఏపీలో ఆర్యవైశ్యులకు అత్యున్నత గౌరవం దక్కుతోంది’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. రంగంలోకి పోలీసులు

దారుణం.. నిద్రలో నుంచి మరణంలోకి..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 15 , 2026 | 05:35 PM