దారుణం.. నిద్రలో నుంచి మరణంలోకి..
ABN , Publish Date - Mar 15 , 2026 | 09:34 AM
ద్విచక్ర వాహనం నుండి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి.. ఊపిరాడక ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ విషాదకర ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఆదివారం చోటు చేసుకుంది.
చిత్తూరు, మార్చి 15: ద్విచక్ర వాహనం నుండి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి.. ఊపిరాడక ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ విషాదకర ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులతోపాటు మరో వ్యక్తి ఉన్నాడు. తాజాగా ఒక వ్యక్తి.. తన ద్విచక్ర వాహనాన్ని బోర్ చేయించాడు. అనంతరం ఆ వాహనాన్ని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఈ వాహనాన్ని రాత్రంతా స్టార్టింగ్‌లోనే ఉంచాలని మెకానిక్ సూచించాడు. దాంతో ఆ వ్యక్తి బండిని స్టార్ట్ చేసి ఉంచి.. ఇంటి గడియ వేశాడు.
ఈ సమయంలో ద్విచక్ర వాహనం నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఇంట్లోనే నలుగురు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వాహన మెకానిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి వివరాలను పోలీసులు వెల్లడించారు. తాత రామచంద్రయ్య (70), మనవరాళ్లు చందన (8), చరిత(8), మనవడు కార్తీక్(15) మృతి చెందారని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉగాది నుంచి ఈ రాశులకు బంగారు సిరులు..!
ప్రజాసమస్యల పరిష్కారంలో ‘ఆంధ్రజ్యోతి’ది కీలక పాత్ర: ఎమ్మెల్యే పులివర్తి నాని
Read Latest AP News And Telugu News