ఉగాది నుంచి ఈ రాశులకు బంగారు సిరులు..!
ABN , Publish Date - Mar 15 , 2026 | 09:04 AM
మరికొద్ది రోజుల్లో పరాభవ నామ ఉగాది సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కొత్త సంవత్సరాది వేళ.. ఈ పండగను ఘనంగా జరుపుకొనేందుకు తెలుగు వారంతా సిద్ధమవుతున్నవారు.
మరికొద్ది రోజుల్లో పరాభవ నామ ఉగాది సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కొత్త సంవత్సరాది వేళ.. ఈ పండగను ఘనంగా జరుపుకొనేందుకు తెలుగు వారంతా సిద్ధమవుతున్నవారు. అలాగే ఆలయాల్లో పంచాంగ శ్రవణం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. ఈ కొత్త ఏడాదిలో ఐదు రాశులను అదృష్టం వరించనుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
వృషభ రాశి..
ఈ రాశివారికి ఉగాది నుంచి బాగా కలిసివస్తుంది. విదేశీ ప్రయాణం వల్ల లాభం పొందుతారు. శని 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. స్థిర, చరాస్తుల కొనుగోలతోపాటు క్రయ, విక్రయాలు జరిపిస్తారు.
తుల రాశి..
శని ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అనారోగ్య సమస్యలు, శత్రు బాధలు తొలగిపోతాయి. అప్పులు క్లియర్ అవుతాయి. రోగ, రుణ శత్రు బాధలు దూరంగా జరుగుతాయి. దైవానుగ్రహం, గురువుల అనుగ్రహం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం కోసం చేసే ప్రయత్నాలు విజయం సాధిస్తారు. జూన్ తొలి వారం వరకు బాగా కలిసి వస్తుంది. ఆరోగ్య, కుటుంబం, ఆర్థిక పరంగా పలు లాభాలు కలుగుతాయి.
కుంభ రాశి..
ఈ ఉగాదితో ఏలినాటి శని దోషం తొలిగిపోతుంది. గురుబలం అద్భుతంగా ఉంది. ఇది మిమ్మల్ని కాపాడుతుంది. వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం అవుతాయి.
మకర రాశి..
ఈ రాశి వారికి ఏడాది మొత్తం విజయాలే వరిస్తాయి. దీంతో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. విదేశీ ప్రయాణానికి అత్యంత అనుకూలమైన సమయం. ఆర్థికంగా, వివాహ, వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే సూచనలు ఉన్నాయి.
కన్యారాశి..
ఈ ఏడాది అనారోగ్యం, శత్రు బాధలు, రుణ బాధలు తొలగిపోతాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు గురుబలం కారణంగా ఆకస్మిక ధన లాభం సూచితం.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇది నమ్మడం మీ వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.