Share News

ఇరాన్ అణు కేంద్ర నగరంపై దాడులు.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ విమానాలు..

ABN , Publish Date - Mar 15 , 2026 | 02:44 PM

ఇరాన్‌లోని అత్యంత కీలకమైన అణు కేంద్ర నగరం ఇస్ఫహాన్‌‌పై భీకర దాడులు జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధ విమానాలు ఇస్ఫహాన్‌పై బాంబుల వర్షం కురిపించాయి. ఆదివారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు.

ఇరాన్ అణు కేంద్ర నగరంపై దాడులు.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ విమానాలు..
Isfahan strike news

ఇరాన్‌లోని అత్యంత కీలకమైన అణు కేంద్ర నగరం ఇస్ఫహాన్‌‌పై భీకర దాడులు జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధ విమానాలు ఇస్ఫహాన్‌పై బాంబుల వర్షం కురిపించాయి. ఆదివారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ ఈ దాడులకు పాల్పడడంతో నష్ట తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది (Isfahan airstrikes).


దాడుల నేపథ్యంలో ఇస్ఫహాన్ నగరం అంతటా నల్లని పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ఇక, పశ్చిమ టెహ్రాన్‌లో ఉన్న స్పేస్ రీసెర్చ్ సెంటర్‌పై కూడా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. ఇరాన్‌కు అవసరమైన శాటిలైట్ ఇంటెలిజెన్స్ మ్యాపింగ్ సమాచారం ఈ సెంటర్ నుంచే లభిస్తుంది. కీలకమైన ఈ సెంటర్‌పై దాడులు జరగడం ఇరాన్‌కు పెద్ద దెబ్బే అని చెప్పక తప్పదు (Iran war day 16).


మరోవైపు ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా తన వద్ద ఉన్న బి-52 బాంబర్‌ను పంపించింది (US Israel Iran conflict). ఇది దాదాపు 38 టన్నుల బాంబులను తీసుకెళ్లగలదు. దీనికి సంబంధించిన వీడియోను యూఎస్ సెంట్రల్ కమాండ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ బి-52 బాంబర్‌తోనే టెహ్రాన్‌లో ఆదివారం ఉదయం దాడులు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

మా డ్రోన్లు కాపీ చేసి మాపైనే నిందలు.. ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు

నెతన్యాహు మరణవార్త 'ఫేక్ న్యూస్'.. క్లారిటీ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం

Updated Date - Mar 15 , 2026 | 03:06 PM