Share News

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. చర్చించే అంశాలివే..

ABN , Publish Date - Mar 15 , 2026 | 01:56 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఉదయం 11:45 గంటలకు ప్రారంభం కానున్నాయి.

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. చర్చించే అంశాలివే..
Telangana Assembly

హైదరాబాద్, మార్చి15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఉదయం 11:45 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సారి అసెంబ్లీకి కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తొలిసారి రావడం విశేషం. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. పదిరోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉంది. సభ ప్రాంగణంలో రేపు(సోమవారం) తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఈ విగ్రహా రూపాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.


సభలో చర్చించే అంశాలివే..

అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలను చర్చించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది.

వాటిలో ప్రధానంగా:

  • గిగ్ వర్కర్ల కొత్త చట్టం: గిగ్ వర్కర్లు (Gig Workers) హక్కుల పరిరక్షణ కోసం కొత్త చట్టానికి మద్దతుపై చర్చించనున్నారు.

  • విద్యా విధానం: విద్యారంగంలో కొత్త విధానాల అమలు, మార్పులు, బడ్జెట్ కేటాయింపులపై చర్చ.

  • సోషల్ మీడియా కట్టడి: ఫేక్ న్యూస్, హార్మ్ కంటెంట్ నియంత్రణపై చట్టపరమైన చర్చ.

  • మూసీ నది ప్రక్షాళనపై చర్చ.

  • నదీ జలాల అంశంపై చర్చ.

  • కాళేశ్వరం ప్రాజెక్టు: ఈ ప్రాజెక్ట్ పనులు, సీబీఐ మౌన పరిస్థితులు, రియల్టీ పరిశీలన.

  • ఈ సమావేశాల్లో ఆవిష్కరణలు, చట్టాలపై చర్చలు, పౌర సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలను తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కొండగట్టును అభివృద్ధి చేస్తాం: బండి సంజయ్

ఆ జిల్లాలో దారుణం.. అచ్చం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఘటన రిపీట్

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. దంపతుల హత్య

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 15 , 2026 | 02:01 PM