Share News

ఆ రెండు దేశాల నౌకలనే హోర్ముజ్ గుండా వెళ్లనివ్వం: ఇరాన్ విదేశాంగ మంత్రి

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:02 PM

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలనే హోర్ముజ్ జలసంధి గుండా అనుమతించడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా హోర్ముజ్ గుండా ప్రయాణించవచ్చని తెలిపారు.

ఆ రెండు దేశాల నౌకలనే హోర్ముజ్ గుండా వెళ్లనివ్వం: ఇరాన్ విదేశాంగ మంత్రి
Iran foreign minister statement

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలనే హోర్ముజ్ జలసంధి గుండా అనుమతించడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా హోర్ముజ్ గుండా ప్రయాణించవచ్చని తెలిపారు. అయితే భద్రతా కారణాల రీత్యా అనేక దేశాలు తమ నౌకలను హోర్ముజ్ గుండా పంపడం లేదని, దానికి, ఇరాన్‌‌కు ‌ఎటువంటి సంబంధమూ లేదని అన్నారు (Iran foreign minister statement).


ప్రస్తుతం హోర్ముజ్ గుండా పలు దేశాల నౌకలు, చమురు ట్యాంకర్లు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయని తెలిపారు. ఇరాన్ సృష్టిస్తున్న కృత్రిమ అడ్డంకుల కారణంగా ఇబ్బందులు పడుతున్న చైనా, ఫ్రాన్స్, జపాన్ తదితర దేశాలు హోర్ముజ్‌ ప్రాంతానికి తమ యుద్ధ నౌకలను పంపించబోతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ కామెంట్స్ చేశారు (Hormuz shipping route). తమ శత్రుదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను మాత్రమే అడ్డుకుంటున్నామని, ఇతర దేశాల నౌకలకు తాము ఇబ్బందులు కలిగించడం లేదని స్పష్టం చేశారు.


ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఇటీవలి దాడుల్లో గాయపడ్డారని వస్తున్న వార్తలపై కూడా అబ్బాస్ స్పందించారు. మొజ్తాబా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, రాజ్యాంగం ప్రకారం తన విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. తమ దేశం పటిష్ట స్థితిలో ఉందని, ఏ ఒక్కరి పైనా ఆధారపడి లేదని అబ్బాస్ చెప్పారు (Iran maritime warning). ఒకవేళ కీలక వ్యక్తులకు ప్రాణనష్టం సంభవించినా వెనకడుగు వేయదని, అన్నింటినీ తట్టుకుని ఎదురు నిలబడగలదని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అంతా తమ అదుపులోనే ఉందన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ అణు కేంద్ర నగరంపై దాడులు.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ విమానాలు..


మీది డేగ చూపు అయితే.. ఇసుకలో దాక్కున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Mar 15 , 2026 | 04:02 PM