Share News

మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:45 PM

దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్
Assembly elections 2026 Schedule

దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది (Assembly elections 2026). అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ రాష్ట్రాలలో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల ప్రకటనతో పాటు వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి (Assam election schedule 2026).

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Tamil Nadu elections 2026 dates)

  • మొత్తం నియోజకవర్గాలు: 234

  • గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: 30 మార్చి 2026 (సోమవారం)

  • నామినేషన్ల దాఖలు చివరి తేదీ: 06 ఏప్రిల్ 2026 (సోమవారం)

  • నామినేషన్ల పరిశీలన తేదీ: 07 ఏప్రిల్ 2026 (మంగళవారం)

  • నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: 09 ఏప్రిల్ 2026 (గురువారం)

  • పోలింగ్ తేదీ: 23 ఏప్రిల్ 2026 (గురువారం)

  • ఓట్ల లెక్కింపు తేదీ: 04 మే 2026 (సోమవారం)

  • ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే తేదీ: 06 మే 2026 (బుధవారం)

పశ్చిమబెంగాల్ ఎన్నికల షెడ్యూల్ (West Bengal election 2026 dates)

మొదటి దశ (152 అసెంబ్లీ నియోజకవర్గాలు)

  • గెజిట్ నోటిఫికేషన్ విడుదల: 30 మార్చి 2026 (సోమవారం)

  • నామినేషన్ల దాఖలు చివరి తేదీ: 06 ఏప్రిల్ 2026 (సోమవారం)

  • నామినేషన్ల పరిశీలన: 07 ఏప్రిల్ 2026 (మంగళవారం)

  • నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: 09 ఏప్రిల్ 2026 (గురువారం)

  • పోలింగ్ తేదీ: 23 ఏప్రిల్ 2026 (గురువారం)

రెండో దశ (142 అసెంబ్లీ నియోజకవర్గాలు)

  • గెజిట్ నోటిఫికేషన్ విడుదల: 02 ఏప్రిల్ 2026 (గురువారం)

  • నామినేషన్ల దాఖలు చివరి తేదీ: 09 ఏప్రిల్ 2026 (గురువారం)

  • నామినేషన్ల పరిశీలన: 10 ఏప్రిల్ 2026 (శుక్రవారం)

  • నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: 13 ఏప్రిల్ 2026 (సోమవారం)

  • పోలింగ్ తేదీ: 29 ఏప్రిల్ 2026 (బుధవారం)

  • ఓట్ల లెక్కింపు: 04 మే 2026 (సోమవారం)

  • ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే తేదీ: 06 మే 2026 (బుధవారం)

కేరళ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Kerala assembly elections 2026 dates)

  • మొత్తం నియోజకవర్గాలు : 140

  • గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: 16 మార్చి 2026 (సోమవారం)

  • నామినేషన్ల దాఖలు చివరి తేదీ: 23 మార్చి 2026 (సోమవారం)

  • నామినేషన్ల పరిశీలన తేదీ: 24 మార్చి 2026 (మంగళవారం)

  • నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: 26 మార్చి 2026 (గురువారం)

  • పోలింగ్ తేదీ: 09 ఏప్రిల్ 2026 (గురువారం)

  • ఓట్ల లెక్కింపు తేదీ: 04 మే 2026 (సోమవారం)

  • ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే తేదీ: 06 మే 2026 (బుధవారం)

అస్సాం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Assam election schedule 2026)

  • మొత్తం నియోజకవర్గాలు : 126

  • గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: 16 మార్చి 2026 (సోమవారం)

  • నామినేషన్ల దాఖలు చివరి తేదీ: 23 మార్చి 2026 (సోమవారం)

  • నామినేషన్ల పరిశీలన తేదీ: 24 మార్చి 2026 (మంగళవారం)

  • నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: 26 మార్చి 2026 (గురువారం)

  • పోలింగ్ తేదీ: 09 ఏప్రిల్ 2026 (గురువారం)

  • ఓట్ల లెక్కింపు తేదీ: 04 మే 2026 (సోమవారం)

  • ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే తేదీ: 06 మే 2026 (బుధవారం)

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Puducherry election schedule 2026)

  • మొత్తం నియోజకవర్గాలు: 30

  • గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: 16 మార్చి 2026 (సోమవారం)

  • నామినేషన్ల దాఖలు చివరి తేదీ: 23 మార్చి 2026 (సోమవారం)

  • నామినేషన్ల పరిశీలన తేదీ: 24 మార్చి 2026 (మంగళవారం)

  • నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: 26 మార్చి 2026 (గురువారం)

  • పోలింగ్ తేదీ: 09 ఏప్రిల్ 2026 (గురువారం)

  • ఓట్ల లెక్కింపు తేదీ: 04 మే 2026 (సోమవారం)

  • ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే తేదీ: 06 మే 2026 (బుధవారం)

ఇవి కూడా చదవండి..

ఇరాన్ అణు కేంద్ర నగరంపై దాడులు.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ విమానాలు..

మీది డేగ చూపు అయితే.. ఇసుకలో దాక్కున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Mar 15 , 2026 | 05:08 PM