వెల్ఫేర్ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలి.. హమాలీ కార్మిక సంఘం డిమాండ్
ABN , Publish Date - Mar 15 , 2026 | 03:10 PM
హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈ రోజు (ఆదివారం) నిర్వహించిన ‘హమాలీ మహా గర్జన’ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, టీజీఎస్ అధ్యక్షుడు కోదండరామ్, కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.
వరంగల్, మార్చి 15: హమాలీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్రంలోని హమాలీలు.. ‘హమాలీ మహా గర్జన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈ రోజు (ఆదివారం) నిర్వహించిన ‘హమాలీ మహా గర్జన’ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, టీజీఎస్ అధ్యక్షుడు కోదండరామ్, కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిస్కరించాలని మంత్రి సీతక్క ఎదుటే కార్మిక సంఘం నేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కార్మికులకు గుర్తింపు ఇచ్చే హమాలీ వెల్ఫేర్ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ కార్మికులకు చట్టబద్ధ ఉపాధి ఉండాలని, ఆహార భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మార్కెట్ యార్డులు, గోదాములు, ఇతర వాణిజ్య ప్రాంతాల్లో పనిచేస్తున్న హమాలీలకు కనీస వేతనాలు నిర్ధారించడంతో పాటు వారి పని పరిస్థితులను మెరుగుపర్చే చర్యలు తీసుకోవాలని తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. హమాలీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, కానీ వారి కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులకు ఇండ్లు మంజూరు చేస్తాం
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కార్మికులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి సీతక్క అన్నారు. కార్మికులకు ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆలస్యమైనా ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు. ఈ మధ్య జరిగిన ఓ సమావేశంలో రాహుల్ గాంధీ కార్మికుల సమస్యలపై ఆరా తీశారని చెప్పారు. తెలంగాణ కార్మికులు ఐక్యంగా ఉండాలన్నారు.
ఇవి కూడా చదవండి
వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..
డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా