Share News

నడిరోడ్డులో గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య.. కారుతో ఢీకొట్టి..

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:29 PM

ఓ గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు నడిరోడ్డులో అతడిని వేటకొడవళ్లతో నరికి చంపేశారు. కేరళలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

నడిరోడ్డులో గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య.. కారుతో ఢీకొట్టి..
Kerala Kollam gangster

తిరువనంతపురం, మార్చి 15: కేరళలో ఓ గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు నడిరోడ్డులో అతడిని వేటకొడవళ్లతో నరికి చంపేశారు. శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొల్లామ్ జిల్లాలోని కరుణగపల్లికి చెందిన గ్యాంగ్‌స్టర్ అలువ అతుల్.. జిమ్ సంతోష్ అనే గ్యాంగ్‌స్టర్‌ను చంపిన కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు. కొన్ని నెలల పాటు జైల్లో ఉన్న అతుల్ తాజాగా బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో జిమ్ సంతోష్ గ్యాంగ్ అతుల్‌ను చంపడానికి ప్లాన్ చేసింది.


శనివారం అతుల్ తన కారులో పుతియకావు సమీపంలోని రోడ్డుపై వెళుతున్నాడు. జిమ్ సంతోష్ గ్యాంగ్ ఓ వైట్ కారులో అతుల్ కారును ఫాలో అయింది. కొంతదూరం పోయిన తర్వాత సంతోష్ గ్యాంగ్ కారు అతుల్ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అతుల్ కారు రోడ్డు పక్క ఉన్న గుంతలోకి దిగిపోయింది. వైట్ కారులోంచి సంతోష్ గ్యాంగ్ సభ్యులు ఐదుగురు వేట కొడవళ్లతో చకచకా కిందకు దిగారు. అతుల్ కారులో ఉండగానే వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన అతుల్ అక్కడికక్కడే చనిపోయాడు.


అతుల్ చనిపోయాడని ధ్రువీకరించుకున్న తర్వాత సంతోష్ గ్యాంగ్ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అతుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 2025లో జరిగిన సంతోష్ మర్డర్‌కు ప్రతీకారంగానే అతుల్ మర్డర్ జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

పార్లమెంట్ మెట్లపై టీ, పకోడీ.. రాహుల్ గాంధీకి ఆ మాత్రం తెలియదా: అమిత్ షా ఆగ్రహం

ఆ రెండు దేశాల నౌకలనే హోర్ముజ్ గుండా వెళ్లనివ్వం: ఇరాన్ విదేశాంగ మంత్రి

Updated Date - Mar 15 , 2026 | 04:42 PM