-
-
Home » Andhra Pradesh » Andhrapradesh Telangana National International news ABN Andhrajyothy Live Updates of 10th March 2026 BSB
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 10 , 2026 | 07:31 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 10, 2026 21:20 IST
ట్రాక్టర్, బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్రగాయాలు..
అనకాపల్లి జిల్లా: గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట హైవేపై ట్రాక్టర్, బైక్ ఢీ..
బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు..
క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలింపు..
-
Mar 10, 2026 21:17 IST
సిద్దిపేట : మిరుదొడ్డి మండలం అందే గ్రామం కోళ్లఫామ్‌లో వేలాది కోళ్ల మృత్యువాత
అంతుచిక్కని వ్యాధితో వందల సంఖ్యలో మృతి చెందిన కోళ్లు..
పరీక్షిస్తున్న వెటర్నరీ డాక్టర్లు..
-
Mar 10, 2026 21:14 IST
కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
52 కేజీల గంజాయి, కారు సీజ్.. ముగ్గురి అరెస్ట్..
ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చాటిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
-
Mar 10, 2026 21:12 IST
అమరావతి: రాష్ట్రంపై యుద్ధ ప్రభావం, పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంపై యుద్ధ ప్రభావం తగ్గించేలా చర్యలు..
పౌల్ట్రీ, హార్టికల్చర్ రంగాల్లో సంక్షోభం తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ..
గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రుల క్షేమ సమాచారంపై నిరంతరం ఆరా..
-
Mar 10, 2026 21:10 IST
కాకినాడ: అన్నవరం కొండపై ఫుడ్ సేప్టీ అధికారుల అకస్మిక దాడులు
కాలం చెల్లిన 127 కూల్ డ్రింక్స్ స్వాధీనం..
వ్యాపారులపై కేసు నమోదు చేసిన పోలీసులు..
-
Mar 10, 2026 20:53 IST
అమరావతి: రాష్ట్రంలో మరో రెండు మున్సిపాలిటీల హోదా పెంపు
పెద్దాపురం మునిసిపాలిటీ హోదాను గ్రేడ్ 2 నుండి స్పెషల్ గ్రేడ్‌కు పెంపు..
జగ్గయ్యపేట మునిసిపాలిటీ హోదాను గ్రేడ్-2నుండి స్పెషల్ గ్రేడ్‌కు పెంపు
ఈ మేరకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్..
-
Mar 10, 2026 20:22 IST
హైదరాబాద్: ఖైరతాబాద్‌లో భారీగా నకిలీ వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం..
రసాయనాలతో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి పేస్టును సీజ్ చేసిన పోలీసులు..
నిందితుడు ఫారూకీని అరెస్టు చేసిన పోలీసులు..
-
Mar 10, 2026 19:32 IST
వరంగల్ నగరంలోని ఎస్సార్ నగర్‌లో దారుణం
మద్యం మత్తులో భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త..
కేసు దర్యాప్తు చేస్తున్న ఇంతేజార్‌గంజ్ పోలీసులు..
-
Mar 10, 2026 19:30 IST
కర్నూలు: ఆదోని హోటళ్లలో సివిల్ సప్లై అధికారుల దాడులు..
107 గ్యాస్ సిలిండర్ల సీజ్..
డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లకు అమ్మితే చర్యలు తప్పవు: జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ రాజా రఘువీర్..
-
Mar 10, 2026 19:27 IST
న్యాయం చేసే వరకూ దీక్ష చేస్తాం: కవిత
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కవిత దీక్ష..
ఖమ్మంలో కవితను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన పోలీసులు..
వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేసే వరకూ దీక్ష చేస్తాం: కవిత
-
Mar 10, 2026 19:25 IST
నకిలీ మద్యం కేసులో సెంథిల్ కుమార్‌కు బెయిల్
విజయవాడ: నకిలీ మద్యం కేసులో సెంథిల్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేసిన ఎక్సైజ్ కోర్టు..
గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సెంథిల్..
-
Mar 10, 2026 19:09 IST
ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ రాజీనామా
వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు పీటర్ ఎల్బర్స్ ప్రకటన..
ఇండిగో తాత్కాలిక సీఈవోగా రాహుల్ భాటియా బాధ్యతలు..
-
Mar 10, 2026 19:00 IST
రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం: మనోహర్
ఎల్పీజీ గ్యాస్ అక్రమంగా తరలిపోకుండా చర్యలు తీసుకోవాలి: మనోహర్
-
Mar 10, 2026 18:59 IST
డ్రోన్ల తయారీ వ్యాపారంలో ట్రంప్ తనయుల పెట్టుబడులు
పవరస్ డ్రోన్ తయారీ కంపెనీలో ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ వాటాదారులు
అన్‌యూజవల్ మెషిన్ డ్రోన్ తయారీ స్టార్టప్ట్‌లో గతంలో ట్రంప్ జూనియర్ పెట్టుబడులు
-
Mar 10, 2026 18:58 IST
మెదక్ జిల్లాలో దారుణం..
మద్యానికి డబ్బులు లేవని శిశువును విక్రయించిన కసాయి తల్లి..
ప్రియుడితో కలిసి రూ.1.70 లక్షలకు శిశువు విక్రయం..
-
Mar 10, 2026 18:56 IST
న్యాయాధికారులను అనుమానిస్తే సహించేది లేదన్న సుప్రీంకోర్టు
న్యాయాధికారులు ఓవర్ టైం పనిచేసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్నారు..
వారి పనికి ఆటంకం కలిగిస్తే ఊరుకోమని హెచ్చరిక..
బెంగాల్ ప్రభుత్వం, ఈసీ మధ్య విశ్వాస లోటు ఉందని వ్యాఖ్య..
-
Mar 10, 2026 18:54 IST
బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం
టాప్-3 బిగ్‌బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట విషాదం..
గత కొంతకాలంగా మరణంతో పోరాడుతున్న పవన్ తండ్రి..
క్యాన్సర్ మహమ్మారి కారణంగా మంగళవారం కన్నుమూత..
-
Mar 10, 2026 18:53 IST
మెదక్ జిల్లా తూప్రాన్ పీఎస్ ఎదుట గొడవ
భర్త కొడుతున్నారని పీఎస్‌లో ఫిర్యాదు చేసిన భార్య..
తన భార్యను తనతో పంపించాలని భర్త ఉదయ్ కిరణ్ గొడవ..
పోలీస్ స్టేషన్ ఎదుట కొట్టుకున్న ఇరు వర్గాలు..
-
Mar 10, 2026 18:50 IST
హైదరాబాద్: సృష్టి కేసులో ఈడీ కీలక నిర్ణయం
డాక్టర్ నమ్రత ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ..
రూ. 50 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ..
2014 నుంచి సరోగసి పేరుతో జరిగిన అక్రమాల గుర్తింపు..
-
Mar 10, 2026 18:21 IST
హైదరాబాద్: ఫిరాయింపు MLAల కేసులో రేపు తీర్పు
దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో తీర్పు ఇవ్వనున్న స్పీకర్..
-
Mar 10, 2026 18:05 IST
మాజీ సీఎం జగన్‌పై మంత్రి పార్థసారథి విమర్శలు
రాష్ట్ర ఖజానాను జగన్ దివాలా తీయించారు: మంత్రి
జగన్ చేసిన అప్పుల వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.71,800 కోట్ల భారం..
జగన్ నిర్వాకంతో బ్యాంకులు అప్పులు ఇవ్వడం మానేశాయ్: మంత్రి పార్థసారథి
-
Mar 10, 2026 17:54 IST
అనకాపల్లి: బాలుడు వెంకట కౌశిక్ మృతి కేసులో వీడిన మిస్టరీ
నాటు తుపాకీ పేలడం వల్లే బాలుడు కౌశిక్ మృతి చెందినట్లు నిర్ధారణ..
కౌశిక్ చేతిలో నాటు తుపాకీ పేలుడుతో మరో ఇద్దరికి గాయాలు..
-
Mar 10, 2026 16:54 IST
మహబూబ్‌నగర్: గండీడు మండలం నంచర్ల స్కూల్‌లో ప్రమాదం
తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడిపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలు
-
Mar 10, 2026 16:52 IST
కాంగ్రెస్ హామీలపై బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తాం: కేటీఆర్
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది: కేటీఆర్
రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇంతవరకు డిప్యూటీ స్పీకర్ లేరు..
ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది..
ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తాం: కేటీఆర్
-
Mar 10, 2026 16:50 IST
28 నుంచి కొత్త IPL సీజన్
ముంబై: మార్చి 28 నుంచి కొత్త IPL సీజన్..
12న IPL షెడ్యూల్ విడుదల చేయనున్న BCCI..
-
Mar 10, 2026 16:36 IST
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
రూ. 8.8 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ ఆమోదం..
రూ.8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ మిషన్ పొడిగింపు..
మదురై ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలని నిర్ణయం..
-
Mar 10, 2026 16:26 IST
అసోం: 13న పీఎం కిసాన్ నిధుల విడుదల
22వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ..
రైతుల ఖాతాల్లో రూ.19 వేల కోట్లు జమచేయనున్న కేంద్రం..
-
Mar 10, 2026 16:12 IST
అమరావతి: గనులశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్‌గా ఏపీ: సీఎం చంద్రబాబు
త్వరలో టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్..
రానున్న పదేళ్లలో గనులశాఖలో రూ.50 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం..
ఏపీలో 3 ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు: సీఎం చంద్రబాబు
-
Mar 10, 2026 15:48 IST
నష్టాల నుంచి లాభాల బాటలోకి స్టాక్ మార్కెట్లు
లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
640 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్..
234 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ..
-
Mar 10, 2026 15:47 IST
సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నటుడు జగపతిబాబు సందడి..
కృష్ణా: గన్నవరం సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నటుడు జగపతిబాబు సందడి..
పొలం రిజిస్ట్రేషన్ కోసం గన్నవరానికి వచ్చిన జగపతిబాబు..
రిజిస్ట్రేషన్ అనంతరం గన్నవరంలోని తన బంధువుల ఇంటికి వెళ్లిన జగపతిబాబు..
-
Mar 10, 2026 15:25 IST
TVK పార్టీ చీఫ్ విజయ్‌కు మరోసారి CBI సమన్లు
కరూర్ MLA సెంథిల్ బాలాజీకి కూడా నోటీసులు..
ఈనెల 15న విచారణకు హాజరుకావాలని ఆదేశం..
ఇద్దరినీ ఢిల్లీలోనే ప్రశ్నించనున్న CBI అధికారులు..
-
Mar 10, 2026 15:08 IST
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ 59వ సమావేశం
తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటుపై సమీక్ష..
రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై చర్చ..
ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుకేశవ్ కేశవ్ హాజరు..
-
Mar 10, 2026 15:08 IST
పశ్చిమాసియాలో యుద్ధం.. శ్రీలంక-అఫ్గానిస్తాన్ మ్యాచ్‌ల రద్దు
మార్చి 13 నుంచి ప్రారంభం కావాల్సిన శ్రీలంక-అఫ్గానిస్తాన్ వైట్ బాల్ సిరీస్..
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఆ సిరీస్ రద్దు..
-
Mar 10, 2026 14:34 IST
హైదరాబాద్: గోదావరి పుష్కరాలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశం..
బాసర నుంచి భద్రాచలం వరకూ దేవాలయాల అభివృద్ధికి ప్రణాళికలు..
గోదావరి పరివాహక ప్రాంతంలోని పురాతన ఆలయాల అభివృద్ధిపై దృష్టి..
దేవాలయాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేసేలా మాస్టర్ ప్లాన్..
-
Mar 10, 2026 13:48 IST
కోనసీమ: అమలాపురం నియోజకవర్గం బట్నవెల్లిలో వైఎస్ షర్మిల రచ్చబండ
అప్పుల్లో రాష్ట్ర రైతులు రెండో స్థానంలో ఉండటం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు: షర్మిల
-
Mar 10, 2026 13:35 IST
కేటీఆర్‌కు AICC కార్యదర్శి సంపత్ హెచ్చరిక
కేటీఆర్ మారకపోతే మరో రకంగా స్పందించాల్సి వస్తుంది: సంపత్
కేటీఆర్ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలి: సంపత్
సీఎం రేవంత్ వ్యాఖ్యలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారు: సంపత్
దుష్ప్రచారాలు చేయడంలో కేటీఆర్ దిట్ట: సంపత్
-
Mar 10, 2026 13:26 IST
సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA అథారిటీ 59వ సమావేశం
వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, సచివాలయం, HoD భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ
తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటుపై సమీక్ష
రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై చర్చ
-
Mar 10, 2026 13:14 IST
సభను కాంగ్రెస్ తప్పుదారి పట్టిస్తోంది: అమిత్‌షా
విపక్షాలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి: అమిత్‌షా
కేంద్రం సమాధానం చెప్పేటప్పుడు పారిపోవద్దు: కిరణ్ రిజిజు
-
Mar 10, 2026 13:04 IST
ఎండ తీవ్రత, వడగాల్పుల సంసిద్ధతపై ఏపీ హోంమంత్రి అనిత సమీక్ష
అధికారులు స్టేట్ హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్లాలి: హోంమంత్రి
వడదెబ్బ కారణంగా ప్రాణనష్టం లేకుండా చూడాలి: అనిత
ఎండ తీవ్రత జాగ్రత్తలపై కలెక్టర్లు విస్తృతంగా ప్రచారం చేయాలి: అనిత
-
Mar 10, 2026 12:51 IST
చిలుక జోస్యం పేరుతో బెంగళూరులో భారీ మోసం
లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి
పూజల పేరుతో బంగారం, వెండి దోచేసిన కేటుగాడు
కర్ణాటకలోని బెంగళూరులో ఘటన
-
Mar 10, 2026 12:44 IST
స్పీకర్ ఓం బిర్లా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు: ఎంపీ జావెద్
స్పీకర్ అధికారపక్ష భాష మాట్లాడుతున్నారు: ఎంపీ జావెద్
8 ఏళ్లుగా డిప్యూటీ స్పీకర్‌ను నియమించలేదు: కేసీ వేణుగోపాల్
చర్చ నుంచి విపక్షం పారిపోతోంది: ఎంపీ రవిశంకర్ ప్రసాద్
-
Mar 10, 2026 12:36 IST
టీమిండియాకు BCCI భారీ నజరానా
టీ20 ప్రపంచకప్ విజేత టీమిండియాకు రూ.131 కోట్ల నజరానా
-
Mar 10, 2026 12:31 IST
స్పీకర్ ఓంబిర్లా మీద అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చ
చర్చకు 10 గంటల సమయం కేటాయింపు..
చర్చను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు..
తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ జావెద్..
స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్న కాంగ్రెస్..
-
Mar 10, 2026 12:14 IST
ముంబైలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ పర్యటన
ఐఏఏపీఐ ఎక్స్‌పోలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ మంత్రి
నూతన పర్యాటక పాలసీ ద్వారా ఇన్వెస్టర్లకు రాయితీలు కల్పిస్తున్నాం: మంత్రి
వినోద రంగం అభివృద్ధికి ఏపీ అనుకూలం: మంత్రి దుర్గేశ్
-
Mar 10, 2026 11:43 IST
తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర భేటీ
గ్యాస్ కొరతతో హైదరాబాద్‌లో 6వేల హోటల్స్‌పై ప్రభావం
తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్న అసోసియేషన్
బెంగళూరు తరహాలో సమ్మెకు సమాలోచనలు
-
Mar 10, 2026 11:39 IST
మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మార్పులు
రాష్ట్రస్థాయి వేడుకలను రద్దు చేసిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రస్థాయి కార్యక్రమంలో మార్పులు
14న ఉమ్మడి జిల్లా కేంద్రాలు, నగరాలు, మండలాలు, పంచాయతీల్లో వేడుకలు
-
Mar 10, 2026 11:24 IST
NCERT బహిరంగ క్షమాపణలు
8వ తరగతి సోషల్ బుక్‌లో న్యాయవ్యవస్థపై..
పాఠ్యాంశం ప్రచురణకు సంబంధించి NCERT క్షమాపణలు
పుస్తకం మొత్తాన్ని ఉపసంహరించుకున్నామని వెల్లడి
-
Mar 10, 2026 11:05 IST
భూదాన్ భూములు అంటేనే పేద వాళ్ళకు ఇచ్చినవి: కల్వకుంట్ల కవిత
ఇళ్లు కూలగొట్టి కర్కశంగా వ్యవహరించారు: కవిత
సమస్య పరిష్కారమయ్యే వరకు దీక్ష కొనసాగుతుంది: కవిత
-
Mar 10, 2026 11:02 IST
లోక్‌సభలో విపక్షాల ఆందోళన
పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల నిరసన
పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చకు విపక్షాల పట్టు
-
Mar 10, 2026 10:38 IST
తిరుపతిలో 20 కేజీల గంజాయి పట్టివేత
గంజాయిని నగరి నుంచి ఓజికుప్పంకు తరలించేందుకు యత్నం
పక్కా సమాచారంతో వడమాలపేట పోలీసుల తనిఖీలు
గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితుల అరెస్ట్
-
Mar 10, 2026 10:32 IST
నేడు లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ప్రస్తుతం 500 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడవుతోన్న సెన్సెక్స్
మళ్లీ 24 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ
కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మదుపర్ల ఆసక్తి
-
Mar 10, 2026 10:01 IST
హైదరాబాద్‌లో డేటింగ్ యాప్ పరిచయం పేరుతో సైబర్ మోసం
స్నేహం పేరుతో దగ్గరై రూ.25 లక్షలు దోచుకున్న సైబర్ కేటుగాళ్లు
నిజం తెలిసి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Mar 10, 2026 09:30 IST
ఖమ్మం అంబేడ్కర్ భవన్‌లో కవిత నిరాహార దీక్ష భగ్నం
దీక్ష భగ్నం చేసి కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు
కవితను హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు
హైదరాబాద్ జాగృతి కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తానంటోన్న కవిత
-
Mar 10, 2026 09:30 IST
బీజేపీ నేత విష్ణువర్ధన్‌పై పోలీసుల ఆంక్షలు
కదిరి నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనవద్దని సూచన
రథం పైకి ఎక్కకుండా విష్ణువర్ధన్‌రెడ్డిపై ఆంక్షలు
కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఆదేశాలతోనే...
తనపై ఆంక్షలు విధించారని విష్ణువర్ధన్ ఆరోపణ
-
Mar 10, 2026 08:45 IST
పోలవరం: రాజవొమ్మంగి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం
జి.శరభవరం సమీపంలో ఓ ఆవును చంపిన పెద్దపులి
ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన గ్రామస్థులు
-
Mar 10, 2026 08:28 IST
ఇవాళ ఉ.10:20 గంటలకు CRDA అథారిటీ సమావేశం
ఉ.12:30 గంటలకు మైనింగ్ శాఖపై చంద్రబాబు సమీక్ష
మ.3:00 గంటలకు RTGSపై సీఎం చంద్రబాబు సమీక్ష
-
Mar 10, 2026 08:15 IST
ఆయుధ దిగుమతుల్లో ప్రపంచంలోనే భారత్‌కు రెండో స్థానం
ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 8.2 శాతం
తొలి ఐదు స్థానాల్లో ఉక్రెయిన్, భారత్, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్థాన్
స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సిప్రీ) తాజా నివేదిక వెల్లడి
-
Mar 10, 2026 08:09 IST
మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర కేబినెట్ సమావేశం
ప్రధాని అధ్యక్షతన జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీ
-
Mar 10, 2026 07:59 IST
నల్గొండ: నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ
లారీ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగిన బస్సు డ్రైవర్, మద్దతుగా మరో ట్రావెల్స్ బస్ డ్రైవర్
లారీ డ్రైవర్‌తో ప్రమాదం గురించి చర్చిస్తుండగా డ్రైవర్, క్లీనర్లపై దూసుకెళ్లిన మరో లారీ
ప్రమాదంలో ట్రావెల్స్ డ్రైవర్‌కు మద్దతుగా వచ్చిన డ్రైవర్, క్లీనర్ మృతి
-
Mar 10, 2026 07:44 IST
త్వరలో 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్
పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష అనంతరం షెడ్యూల్ విడుదలకు అవకాశం
అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఇప్పటికే ఈసీ పరిశీలన పూర్తి
ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేలా సన్నాహాలు
-
Mar 10, 2026 07:41 IST
సుప్రీం లీడర్ మరణం తర్వాత స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసిన ఇరాన్
ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ ద్వారా దాడులకు ప్లాన్
ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్‌ను అడ్డుకున్న అమెరికా
-
Mar 10, 2026 07:35 IST
నేటి మార్కెట్లో స్థిరంగా బంగారం ధరలు
24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1,61,670కి చేరిన బంగారం
22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1,48,190కి చేరిన పసిడి
క్రితం రోజుతో పోలిస్తే కిలోపై రూ.100 తగ్గిన వెండి రేటు
ప్రస్తుతం దాదాపు రూ.2.79 లక్షలుగా ట్రేడ్ అవుతున్న కిలో వెండి
-
Mar 10, 2026 07:29 IST
నేడు రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం సహా పలు బిల్లులపై చర్చ