నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు..
ABN , Publish Date - Mar 10 , 2026 | 10:27 AM
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కాస్త కోలుకున్నాయి. అంతర్జాతయ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని ఆంక్షలను సడలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం సానుకూలాంగా మారింది.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కాస్త కోలుకున్నాయి. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని ఆంక్షలను సడలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సానుకూలంగా మారింది. అలాగే కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం, ఇరాన్ యుద్ధం ముగింపు గురించి ట్రంప్ మాట్లాడడం పాజిటివ్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (77,566)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 800 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ అదే జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్ల లాభంతో 78,100 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 166 పాయింట్ల లాభంతో 24,183 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, డిక్సన్ టెక్నాలజీస్, పెట్రోనాట్ ఎల్‌ఎన్‌జీ, గోద్రేజ్ కన్జ్యూమర్, జిందాల్ స్టీల్ లాభాల్లో ఉన్నాయి (share market news). కేఈఐ ఇండస్ట్రీస్, భారత్ ఫోర్జ్, ఇన్ఫోసిస్, జుబిలెంట్ ఫుడ్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 726 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 556 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.17గా ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..
స్వల్ప తగ్గుదల.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..