ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..
ABN , Publish Date - Mar 10 , 2026 | 07:11 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మనదేశ నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్, ఎరువుల దిగుమతులకు ఆటంకం ఏర్పడడంతో, అతి త్వరలోనే వీటి నిల్వలు నిండుకుంటాయని భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మనదేశ నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్, ఎరువుల దిగుమతులకు ఆటంకం ఏర్పడడంతో, అతి త్వరలోనే వీటి నిల్వలు నిండుకుంటాయని భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరుగుతాయనే వార్తలను ఖండించింది. కొంతపాలం పాటు నష్టాలను చమురు కంపెనీలు భరిస్తాయని వెల్లడించింది (Iran war impact on India).
రాబోయే 6 నుంచి 8 వారాల వరకు ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోల్ నిల్వలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు కూడా ప్రస్తుతానికి సరిపోతాయని పేర్కొంది. అయితే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 25 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ఈ వ్యవధి 21 రోజులు ఉండేది. మనదేశంలో సగటున ఒక కుటుంబం ఏడాదికి 7 నుంచి 8 సిలిండర్లను మాత్రమే వినియోగిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది (Petrol prices India Iran war).
అలాగే రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది (Fertilizer prices India). అయితే ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతలు, గ్యాస్ సరఫరాలో కోత యూరియా ఉత్పత్తులపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం 177.31 లక్షల టన్నుల ఎరువులు నిల్వలున్నట్టు తెలిపింది. వాటిల్లో 59.30 లక్షల టన్నుల యూరియా, 25.13 లక్షల టన్నుల డీఏపీ, 55.87 లక్షల టన్నుల ఎన్‌పీకేఎస్ నిల్వలున్నాయని పేర్కొంది.
ఈ వార్తలూ చదవండి:
సముద్రం ఒడ్డున అరుదైన చేప.. మరో విపత్తు రానుందా?
మహిళ ఇక్కట్ల పాలు ! మరో దారి లేక దుబాయ్ హోటల్‌లో దిగితే..