Share News

మహిళ ఇక్కట్ల పాలు ! మరో దారి లేక దుబాయ్ హోటల్‌లో దిగితే..

ABN , Publish Date - Mar 09 , 2026 | 03:34 PM

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నడుమ దుబాయ్‌ హోటల్‌లో దిగిన ఒక మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఈ ఉదంతంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

మహిళ ఇక్కట్ల పాలు ! మరో దారి లేక దుబాయ్ హోటల్‌లో దిగితే..
Dubai flight cancellation

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అక్కడున్న అనేక మందికి చివరి నిమిషంలో ఫ్లైట్స్ రద్దు కావడం, రీబుకింగ్‌కు ఛాన్సులు తక్కువగా ఉండటంతో స్థానిక హోటల్స్‌లో ఉండిపోవాల్సి వస్తోంది. దుబాయ్‌లో సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఒక మహిళకు హోటల్ బిల్లు తడిసి మోపెడు కావడంతో ఊహించని షాక్ తగిలింది.

మీడియా కథనాల ప్రకారం, ఫ్లైట్ జర్నీలో ఆటంకం కారణంగా ఆమె అక్కడ ఒక హోటల్‌లో బస చేయాల్సి వచ్చింది. త్వరలోనే అక్కడి నుంచి బయలుదేరవచ్చని తొలుత ఆమె భావించింది. ఇందుకు సంబంధించిన బిల్లు ఎయిర్‌లైన్స్ భరిస్తుందని అనుకుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో హోటల్‌లో ఎక్కువ రోజులు ఉండాల్సి రావడంతో బిల్లు ఏకంగా రూ.6 లక్షలకు చేరుకుంది.


బిల్లు అంతకంతకూ పెరుగుతుండటంతో హోటల్ వారు ఆమెను సంప్రదించారు. బాకీ పడ్డ మొత్తాన్ని ముందు చెల్లిస్తేనే హోటల్‌‌లో ఆమె కొనసాగేందుకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. లేకపోతే గది ఖాళీ చేయకతప్పదని అన్నారు. త్వరలో బయలుదేరవచ్చని ఆమె అనుకుంటున్న తరుణం హోటల్ గది అద్దె భారీ భారం ఊహించని రీతిలో పెరగడంతో ఆమె నివ్వెరపోయి తన గోడును మీడియాతో పంచుకుంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఫ్లైట్స్ రద్దు సమయంలో ఎయిర్‌లైన్స్‌లు ‌పరిమిత సంఖ్యలో ఇచ్చే వోచర్లతో అనేక మంది కొన్ని ఖరీదైన హోటల్స్‌లో బస చేస్తున్నారట. హోటల్‌‌లో గది అద్దెను ఎయిర్‌లైన్స్ సంస్థలు భరిస్తాయని భావిస్తున్నారు.

అయితే, అన్ని ఖర్చులూ ఎయిర్‌లైన్స్ సంస్థలే భరిస్తాయని అస్సలు అనుకోవద్దని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఖరీదైన హోటల్స్‌లో దిగడం, ఎక్కువ కాలం పాటు హోటల్స్‌‌లో బస చేయడం వంటి వాటి బిల్లులు ఎయిర్‌లైన్స్ పాలసీ పరిధిలోకి రాకపోవచ్చని అంటున్నారు. ఈ విషయంలో ముందుగానే పూర్తిస్థాయి సమాచారం తెలుసుకున్నాకే ముందడుగు వేయాలని అంటున్నారు.


ఈ వార్తలూ రాయండి:

ఇదే తన చివరి జర్నీ అంటూ యూట్యూబర్ లైవ్ స్ట్రీమింగ్! చివరకు..

చీరకట్టులో మహిళల సాహనం! చూసి తీరాల్సిన వీడియో

Updated Date - Mar 09 , 2026 | 04:12 PM