Share News

ఇదే తన చివరి జర్నీ అంటూ యూట్యూబర్ లైవ్ స్ట్రీమింగ్! చివరకు..

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:11 AM

తన చివరి జర్నీ ఇదే అంటూ ఒక ప్రముఖ యూట్యూబర్ తాజాగా పోస్టు చేసిన వీడియో అతడి ఫాలోవర్లలో ఆందోళన రేకెత్తించింది.

ఇదే తన చివరి జర్నీ అంటూ యూట్యూబర్ లైవ్ స్ట్రీమింగ్! చివరకు..
Anurag Dobhal viral video

ఇంటర్నెట్ డెస్క్: పాప్యులర్ యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అనురాగ్ దొభాల్ తాజాగా నెట్టింట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, వీడియోలో అనురాగ్ ఆత్మహత్యాయత్నం చేసినట్టు కనిపించడంతో ఫాలోవర్లలో ఆందోళన వ్యక్తమైంది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, అనురాగ్ కారును డ్రైవ్ చేస్తూ తన మానసిక ఇబ్బందుల గురించి ప్రస్తావించాడు. తన జీవితంలో ప్రేమ, ఆపేక్ష లోపించాయని అన్నాడు. ‘నేను మళ్లీ పుట్టేటట్టైతే.. అమ్మా.. నాపై ఆప్యాయత చూపించు. నాకూ ప్రేమ, ఆప్యాయతలు కావాలి’ అని వ్యాఖ్యానించాడు. ఇదే తన చివరి జర్నీ అని అతడు అనట్టు కూడా కథనాలు వెలువడ్డాయి. ఆ తరువాత కొన్ని క్షణాలకే కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో లైవ్ స్ట్రీమింగ్ నిలిచిపోయింది.


అయితే, అనురాగ్ క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన తరువాత అతడు తన కారును కొంత దూరంలో పార్క్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయమై అనురాగ్ కూడా ఇంకా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.

యూకే07 రైడర్‌గా అనురాగ్ సోషల్ మీడియాలో మంచి పాప్యులారిటీ సాధించాడు. బిగ్ బాస్ 17 ఎడిషన్‌లో కూడా పాల్గొనడంతో అతడి పాప్యులారిటీ మరింత పెరిగింది. అయితే, తాజా ఘటనతో అతడి అభిమానులు నెట్టింట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఎవరి సాయాన్నైనా తీసుకోవాలని అభ్యర్థించారు. ఇటువంటి సున్నితమైన సోషల్ మీడియా కంటెంట్‌‌కు సంబంధించి ప్రత్యేక నిబంధనలు ఉండాలని మరికొందరు అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలూ రాయండి:

చీరకట్టులో మహిళల సాహనం! చూసి తీరాల్సిన వీడియో

బొగ్గులా నల్లగా దోశ.. రెస్టారెంట్ ప్రయోగం వైరల్

Updated Date - Mar 08 , 2026 | 11:21 AM