అనవసర పంచాయితీలో దూరి ఇద్దరు వ్యక్తుల దుర్మరణం
ABN , Publish Date - Mar 10 , 2026 | 08:07 AM
నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ మధ్య చిన్నపాటి ప్రమాదం జరిగింది. అయితే, ఆ తరువాత జరిగిన వాగ్వాదం మరో విషాదానికి దారి తీసింది.
నల్గొండ జిల్లా: నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ మధ్య చిన్నపాటి ప్రమాదం జరిగింది. అయితే, ఆ తరువాత జరిగిన వాగ్వాదం మరో విషాదానికి దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికుల సమాచారం ప్రకారం.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఒక లారీ డ్యాష్ ఇచ్చింది. దీంతో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తనకు మద్దతుగా మరో ట్రావెల్స్ డ్రైవర్‌ను అక్కడికి పిలిపించుకున్నాడు బస్సు డ్రైవర్. లారీ డ్రైవర్‌తో ప్రమాదం గురించి మాట్లాడుతున్న సమయంలో అక్కడ నిలబడి ఉన్న డ్రైవర్, క్లీనర్‌పై మరో లారీ వేగంగా దూసుకొచ్చింది.
ఈ ప్రమాదంలో ట్రావెల్స్ డ్రైవర్‌కు మద్దతుగా వచ్చిన మరో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అవసరం లేని వివాదంలో జోక్యం చేసుకుని చివరకు ప్రమాదానికి గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read:
పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమోటా
పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు
For More Latest News