Share News

పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:30 AM

పేదల ఇళ్లు కూలగొట్టడం మా ప్రభుత్వ ఉద్దేశం కాదు. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దాంతో, వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి.....

పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు

  • నాలాలు, చెరువుల ఆక్రమణలతో ఇబ్బందులు

  • వాటిని తొలగించేందుకే పునరుద్ధరణ పనులు

  • మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే నగరానికి అన్యాయం

  • ఆస్తులు కోల్పోయే వారికి పరిహారం, ఇల్లుకోల్పోతే ఇల్లు.. నల్లచెరువు ప్రారంభోత్సవంలో సీఎం పోస్టింగులు.. చూస్తున్నారుగా!

  • అధికారులను ఏ, బీ, సీ క్యాటగిరీలుగా పెట్టుకున్నా

  • దానికి అనుగుణంగానే పోస్టింగులు ఇస్తున్నా

  • పోలీసింగ్‌లో మానవీయ కోణం పెరగాలి.. పోలీసు అధికారుల రిట్రీట్‌ కార్యక్రమంలో రేవంత్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ‘‘పేదల ఇళ్లు కూలగొట్టడం మా ప్రభుత్వ ఉద్దేశం కాదు. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దాంతో, వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. నిత్యావసరాలు పాడై ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యలు తొలగించేందుకే చెరువులు, నాలాల పునరుద్ధరణ చేపడుతున్నాం. ఇందుకు సహకరించాలి. చెరువులు, నాలాలు ఆక్రమించుకున్న పెద్దలు, మిత్రులు, శ్రేయోభిషులు కూడా సహకరిస్తే బాగుంటుంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో రూ.20 కోట్లతో హైడ్రా అభివృద్ధి చేసిన నల్ల చెరువును సోమవారం ఆయన ప్రారంభించారు. చెరువు వద్ద గంగకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళా స్వయంసహాయక సంఘాలకు స్టాల్స్‌ కేటాయిస్తున్నామని, వాకింగ్‌కు వచ్చేవారు నిత్యావసరాలు కొనుక్కెళ్లే అవకాశం ఉంటుందన్నారు.


మూసీని అభివృద్ధి చేసుకోవద్దా!?

‘‘అహ్మదాబాద్‌లో సబర్మతి, ఢిల్లీలో యమున, ఉత్తరప్రదేశ్‌లో గంగ నదులను అభివృద్ధి చేసుకున్నారు. మూసీని మనం ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదు!? మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ ఎందుకు చేసుకోకూడదో ప్రజలు ఆలోచించాలి. నదీ ప్రక్షాళనను అడ్డుకుంటే నగరానికి అన్యాయం చేసినట్టవుతుంది’’ అని సీఎం స్పష్టంచేశారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు ఏదో ఓ సమస్యతో బాధపడుతున్నాయని, మన హైదరాబాద్‌ ఎంతో సురక్షిత నగరమని, దీన్ని మరింత పర్యావరణహితంగా మార్చేందుకు సహకరించాలని కోరారు. ‘‘ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా పెరిగి నివసించలేని దుస్థితి నెలకొంది. పాఠశాలలు, ప్రభు త్వ కార్యాలయాలు, చివరకు పార్లమెంట్‌కూ సెలవులిచ్చే పరిస్థితి వచ్చింది. ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు వంటివి ఉన్న దేశ రాజధానిలో ముందుచూపు లేకపోవడం వల్లే ఈ దుస్థితి. ముంబైలో వాన పడితే ముంపు. బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్య. చెన్నైలో అపార్ట్‌మెంట్లలోకి వరద నీరు వస్తోంది. కానీ, తెలంగాణలో కోర్‌ అర్బన్‌ రీజియన్‌ వరకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఆ నగరాల్లా కాకుండా.. భవిష్యత్‌ తరాలకు ఇబ్బంది లేకుం డా కోర్‌ పరిధిలో చెరువులు, నాలాల పునరుద్ధరణ, పార్కులు, క్రీడా మైదానాల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం తో హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్దాం’’ అని సీఎం పిలుపునిచ్చారు. మూసీ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణ క్రమంలో ఆ స్తులు కోల్పోయే వారికి పరిహారం ఇస్తామని, ఇళ్లు కో ల్పోయే వారికి నివాసాలు కేటాయిస్తామని చెప్పారు.

మీ రుణం తీర్చుకుంటా..

‘‘రాజకీయంగా కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు మీరు సహకరించారు. ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపారు. ఇప్పుడు సీఎంగా ఉన్నా. మీ రుణం తీసుకోవాల్సిన బాధ్యత నాది. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీ అభివృద్ధికి కృషి చేస్తా. పని చేయడానికి, నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నా. పని చేయించుకోకపోతే మీదే తప్పు. రాజకీయాలకతీతంగా అవసరమైన నిధులు మంజూరు చేస్తా’’ అని రేవంత్‌ హామీఇచ్చారు. ‘హైడ్రా ప్రారంభించినప్పుడు నాపై తీవ్ర విమర్శలు చేశారు. నా ఆలోచనలు, సంకల్పంలో దురుద్దేశాలు లేవు. నల్లచెరువు అభివృద్ధి చూశాక.. గతంలో నాకు పడ్డ తిట్లను ఆశీర్వాదాలుగా భావిస్తున్నా’’ అని అన్నారు. ఉపాధి కోసం జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఉండేందుకు ప్రభుత్వ భూములు, చెరువుల పక్కన గుడిసెలు నిర్మించుకున్నారని, అభివృద్ధి కోసం వాటిని తొలగించినప్పుడు కొందరు పేదలకు నష్టం, ఇంకొందరికి దు:ఖం కలగొచ్చని, వారిలో అర్హులకు రెండు పడకల ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Mar 10 , 2026 | 04:30 AM