Share News

దారుణం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

ABN , Publish Date - Mar 10 , 2026 | 08:35 PM

వరంగల్ నగరం 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి అతని భార్యపై దాడి చేసి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

దారుణం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త
Husband Kills Wife

వరంగల్, మార్చి10: వరంగల్ నగరం(Warangal city) 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అబ్బరబోయిన రాజు అనే వ్యక్తి మద్యం మత్తులో తన భార్య అనిత(40) పై దాడి చేసి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనిత తన బాబాయి కర్మకాండకు వెళ్లి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో రాజు మద్యం సేవించి ఉన్నాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రాజు క్షణికావేశంతో అక్కడే ఉన్న రోకలితో అనిత తలపై బలంగా కొట్టాడు. దాంతో అనిత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.


భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్న విషయం గమనించి స్థానికులు ఇంట్లోకి రాగా అప్పటికే తీవ్ర రక్తస్రావంతో అనిత కిందపడి ఉంది. వెంటనే స్థానికులు ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను బతికించాలని శ్రమించినప్పటికీ, తీవ్ర రక్తస్రావం కావడంతో అనిత చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనపై ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అనకాపల్లిలో మైనర్ మృతి.. వీడిన మిస్టరీ

మూసీ పేరుతో మూటల వేటకు వ్యతిరేకం: కేటీఆర్

Read Latest TG News And Telugu News

Updated Date - Mar 10 , 2026 | 08:35 PM