ఆయుధ దిగుమతుల్లో రెండో స్థానంలో భారత్.. తొలి స్థానంలో ఉక్రెయిన్
ABN , Publish Date - Mar 10 , 2026 | 08:12 AM
ఆయుధ దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నట్టు స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రీ) తాజా నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఉక్రెయిన్ తొలి స్థానంలో ఉంది. 2021-25 కాలానికి సంబంధించిన వివరాలను సిప్రీ తాజాగా బయటపెట్టింది.
ఆయుధ దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నట్టు స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రీ) తాజా నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఉక్రెయిన్ తొలి స్థానంలో ఉంది. 2021-25 కాలానికి సంబంధించిన వివరాలను సిప్రీ తాజాగా బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం ఆయుధ దిగుమతుల్లో ఉక్రెయిన్, భారత్, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్థాన్ వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి (India arms imports,).
ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 8.2 శాతంగా ఉంది. అయితే 2015-20 కాలంతో పోల్చుకుంటే 2021-25లో విదేశాల నుంచి ఆయుధ కొనుగోళ్లు 4 శాతం మేర తగ్గాయి. అలాగే భారత ఆయుధ దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతం ఉంది. అంతకుముందు కాలంలో ఇది 51 శాతంగా ఉండేది. ఇక, 2011-15 కాలంలో అయితే ఏకంగా 70 శాతంగా ఉండేది. రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించిన భారత్.. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాల వైపు మళ్లింది (India second largest arms importer).
మరోవైపు పాకిస్థాన్ తన ఆయుధ దిగుమతుల కోసం చైనాపైనే ఎక్కువగా ఆధారపడింది (Global weapons import). 2021-25 కాలంలో పాక్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో చైనా వాటా ఏకంగా 80 శాతంగా ఉంది. 2016-20 కాలంతో పోల్చుకుంటే 2021-25 కాలంలో పాక్ ఆయుధ దిగుమతులు ఏకంగా 66 శాతం మేరకు పెరిగాయి. కాగా, ప్రపంచ దేశాలకు ఆయుధ సరఫరాదారులుగా అమెరికా (35 శాతం), రష్యా (17 శాతం), చైనా (14 శాతం) కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..
స్వల్ప తగ్గుదల.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..