Share News

సుప్రీం లీడర్ మరణం.. స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసిన ఇరాన్..

ABN , Publish Date - Mar 10 , 2026 | 07:05 AM

సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యతో ఇరాన్ తీవ్ర ఆగ్రహావేశాలకు గురైంది. శత్రు దేశాలు అమెరికా, ఇజ్రాయెల్‌పై పగ తీర్చుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.

సుప్రీం లీడర్ మరణం.. స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసిన ఇరాన్..
Iran sleeper cells

న్యూయార్క్, మార్చి 10: అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై బాంబు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ నాయకులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. టెహ్రాన్‌లోని మొత్తం 30 చోట్ల అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు భార్య, కోడలు, మనవడు చనిపోయారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన కీలక నేతలు చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.


స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసిన ఇరాన్..

సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యతో ఇరాన్ తీవ్ర ఆగ్రహావేశాలకు గురైంది. శత్రు దేశాలు అమెరికా, ఇజ్రాయెల్‌పై పగ తీర్చుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. ఓ అమెరికా మీడియా కథనం ప్రకారం.. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసింది. విదేశాల్లో ఉన్న ఇరాన్ స్లీపర్ సెల్స్ దాడులు చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్‌ను అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గుర్తించాయి. నిఘా వర్గాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి.


ప్రిలిమినరీ సిగ్నల్స్ అనాలసిస్‌లో ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్‌ ఇరాన్‌ నుంచే వచ్చినట్లు తేలింది. సాధారణానికి భిన్నంగా, ఈ సిగ్నల్స్ పలు దేశాల ద్వారా రీ-బ్రాడ్కాస్ట్ కావడం.. రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్లను నిరంతరం పర్యవేక్షించే విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. ఎన్‌క్రిప్టెడ్ భాషలో ఉన్న ఆ మెసేజ్‌‌లను చదవటం అంత సులభం కాదు. డిక్రిప్షన్ కీ ఉన్న వారు మాత్రమే వాటిని చదవగలరు. ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌లపై ఆధారపడకుండా, డిజిటల్ ఆధారాలు దొరకకుండా సిగ్నల్స్ పంపడానికి ఇటువంటి కమ్యూనికేషన్ పద్ధతులను సాధారణంగా నిఘా సంస్థలు లేదా ఉగ్రవాద ముఠాలు ఉపయోగిస్తుంటాయి.


ఇవి కూడా చదవండి

ట్రేడింగ్‌ పేరుతో రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగికి కుచ్చుటోపీ.. రూ.94.36 లక్షలు స్వాహా

స్వల్ప తగ్గుదల.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 10 , 2026 | 07:13 AM