ట్రేడింగ్ పేరుతో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి కుచ్చుటోపీ.. రూ.94.36 లక్షలు స్వాహా
ABN , Publish Date - Mar 10 , 2026 | 06:50 AM
ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.94.36 లక్షలు కాజేశారు. కొత్తపేటకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి (70)ని సైబర్ నేరగాళ్లు సంప్రదించారు.
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.94.36 లక్షలు కాజేశారు. కొత్తపేటకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి (70)ని సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో మంచి లాభాలు వస్తాయని చెప్పి, 5 పైసా ట్రేడింగ్ పేరుతో ఉన్న వాట్సప్ గ్రూపు(WhatsApp group)లో చేర్చారు. అనంతరం వారు పంపిన లింక్ ద్వారా యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేయించారు. పలు దఫాలుగా డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు. యాప్‌లో లాభాలు వచ్చినట్లు చూపారు.
లాభాల్లో రూ.లక్ష విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇవ్వడంతో పూర్తిగా నమ్మిన బాధితుడు పలు దఫాలుగా రూ.94.36 లక్షలు పెట్టుబడి పేరుతో వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశాడు. పెట్టుబడి, లాభాలు కలిపి యాప్‌లో రూ.1.60 కోట్లు ఉన్నట్లుగా చూపడంతో విత్‌డ్రా చేసుకునే యత్నం చేశాడు. జీఎ్‌సటీ, టాక్స్ చెల్లించాలని ఒకసారి, ఇంకా పెట్టుబడులు పెట్టాలని ఇంకా ఒత్తిడి చేస్తుండటంతో మోసపోయానని గ్రహించి మల్కాజిగిరి సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు..
డిజిటల్ అరెస్ట్ పేరుతో..
ఉగ్రకార్యకలాపాలకు సంబంధించిన డబ్బు మీ బ్యాంకు ఖాతాలో జమ అయిందని, అరెస్ట్ చేస్తామని బెదిరించిన సైబర్ నేరగాళ్లు ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ. 30 లక్షలు వసూలు చేశారు. మల్కాజిగిరికి చెందిన ప్రైవేటు ఉద్యోగి (51)కి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ‘మీ పేరుతో ముంబైలో ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాలో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన రూ.36 లక్షలు జమ అయ్యాయి. మీపై ముంబై ఏటీఎస్ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది’ అని తెలిపారు. బాధితుడితో ఆరెట్టి పేరుతో ఉన్న యాప్ డౌన్‌లోడ్ చేయించారు. వీడియో కాల్‌లో పోలీస్ దుస్తులు ధరించిన సైబర్ నేరగాడు తనను తాను ముంబై ఏటీఎస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు.
అరెస్ట్ వారెంట్‌ను చూపుతూ ఈ కేసులో కుటుంబసభ్యులను కూడా అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇంటి నుంచి కదల కుండా చేశాడు. రెండు గంటల్లో ముంబై వచ్చి సంబంధిత పత్రాలను చూపాలని లేని పక్షంలో తాను సూచించిన ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేయాలని సూచించాడు. వెరిఫికేషన్ చేసి, రీఫండ్ చేస్తామని చెప్పడంతో నమ్మిన బాఽధితుడు తన ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు విత్‌డ్రా చేసి రూ. 30 లక్షలు వారు సూచించిన ఖాతాలకు పంపాడు. డబ్బు రీఫండ్ చేయకపోవడం.. స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి మల్కాజిగిరి సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఢిల్లీ మద్యం స్కాం రౌజ్ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే
వెంకటేశ్‌నాయుడు విచారణకు అనుమతివ్వండి
Read Latest Telangana News and National News