కళలపై వైసీపీ విమర్శ వారి అజ్ఞానానికి నిదర్శనం
ABN , Publish Date - Mar 10 , 2026 | 06:03 AM
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇటీవల నిర్వహించిన ఆటవిడుపు కార్యక్రమంపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం దురదృష్టకరమని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు.
ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ
విజయవాడ సిటీ, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇటీవల నిర్వహించిన ఆటవిడుపు కార్యక్రమంపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం దురదృష్టకరమని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ‘కళలను పనికిమాలిన చర్య అని విమర్శించడం వైసీపీ అజ్ఞానానికి నిదర్శనం. మాట్లాడానికి సైతం మేకప్ వేసుకునే మీరు కళాకారుల వేషాధారణను హేళన చేయడం హాస్యాస్పదం. కళాకారులకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.