Share News

వెంకటేశ్‌నాయుడు విచారణకు అనుమతివ్వండి

ABN , Publish Date - Mar 10 , 2026 | 05:56 AM

మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చెరుకూరి వెంకటేశ్‌నాయుడిని విచారించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సిట్‌ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు.

వెంకటేశ్‌నాయుడు విచారణకు అనుమతివ్వండి

  • మద్యం కుంభకోణం కేసులో సిట్‌ పిటిషన్‌

  • తాండ్ర రమేశ్‌కు బెయిల్‌ మంజూరు

విజయవాడ, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చెరుకూరి వెంకటేశ్‌నాయుడిని విచారించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సిట్‌ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఇతను ముఖ్య అనుచరుడు. కొద్దిరోజుల క్రితం వారిద్దరూ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు. వెంకటేశ్‌నాయుడి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, అతడిని విచారించడానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. కాగా, నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు జోగి రాముల బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఎక్సైజ్‌ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని జోగి బ్రదర్స్‌ను ఆదేశించింది. బెయిల్‌పై బయటకు వచ్చిన జోగి బ్రదర్స్‌ షరతులను ఉల్లంఘించడంతో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా, నకిలీ మద్యం తయారీ కేసులో మరో నిందితుడు తాండ్ర రమేశ్‌(ఏ15)కు విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిసేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ కోసం పిటిషన్‌పై వాదప్రతివాదనలు పూర్తికావడంతో న్యాయాధికారి జి.లెనిన్‌బాబు సోమవారం తీర్పు వెలువరించారు.

Updated Date - Mar 10 , 2026 | 05:58 AM