ఈ నెలంతా ‘నీళ్ల’ పంచాయితీ!
ABN , Publish Date - Mar 10 , 2026 | 06:22 AM
కృష్ణా జలాల్లో నీటి వాటాలు, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న పంచాయితీకి సంబంధించి ఈ నెల కీలకంగా మారింది.
కేంద్రం గెజిట్‌పై రేపు సుప్రీంలో ఏపీ వాదనలు?
బనకచర్లపై 27న హైదరాబాద్‌లో కేంద్ర జలశక్తి కార్యదర్శి సమీక్ష
అమరావతి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో నీటి వాటాలు, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న పంచాయితీకి సంబంధించి ఈ నెల కీలకంగా మారింది. కృష్ణా జలాల పునఃపంపిణీని బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌కు అప్పగిస్తూ విధివిధానాలతో కేంద్రం జారీచేసిన గెజిట్‌కు వ్యతిరేకంగా ఏపీ దాఖలుచేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు మరోసారి విచారించే అవకాశముంది. ఇదే అంశంపై బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ఈ నెల 23, 24, 25 తేదీల్లో మరోసారి విచారణ జరపనుంది. అలాగే, ఏపీ పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో ఈ నెల 27న కేఆర్‌ఎంబీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారని జలవనరుల ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి.