-
-
Home » Mukhyaamshalu » ap telangana national international ABN Andhrajyothy live updates of 10th february 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 10 , 2026 | 06:06 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Feb 10, 2026 21:50 IST
నటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో దక్కని ఊరట
ఈ దశలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు.
కేసు పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులకు ఆదేశం.
తదుపరి విచారణ ఈనెల 12కి వాయిదా.
విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసుపై ఏపీ హైకోర్టు విచారణ.
-
Feb 10, 2026 21:34 IST
కృష్ణా: జగన్‌తో పాటు వైసీపీ బ్యాచ్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం
తిరుమల లడ్డూ విషయంలో జగన్ మహాపాపానికి ఒడిగట్టారు.
లడ్డూలో రసాయనాలు కలిపినట్లు సిట్ నివేదికలో స్పష్టంగా ఉంది.
జగన్ అండ్ బ్యాచ్ ఇంకా బుకాయిస్తున్నారు.
టీటీడీ నిబంధనలు సడలించి లడ్డూలో రసాయనాలు కలిపారు.
తప్పు చేసినవారిని ఆ తిరుమలేశుడు తప్పక శిక్షిస్తాడు.
-
Feb 10, 2026 21:33 IST
మేడారం జాతర హుండీల లెక్కింపు పూర్తి
6 రోజుల్లో మొత్తం 828 హుండీల లెక్కింపు.
హుండీల మొత్తం ఆదాయం రూ.12.64 కోట్లు.
గత జాతరతో పోల్చితే తగ్గిన ఆదాయం.
2024 జాతరలో రూ.13.25 కోట్ల ఆదాయం.
హుండీల్లో 18 దేశాలకు చెందిన కరెన్సీ లభ్యం.
-
Feb 10, 2026 21:29 IST
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఫలితాలు.
-
Feb 10, 2026 21:19 IST
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌కు బెదిరింపులు.
వాట్సాప్ వాయిస్ నోట్ పంపి బెదిరింపులకు పాల్పడిన దుండగుడు.
డబ్బులు ఇవ్వాలని డిమాండ్.
ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు.. భద్రత కట్టుదిట్టం.
-
Feb 10, 2026 20:22 IST
అవిశ్వాస తీర్మానం నోటీసులో సాంకేతక లోపం
నోటీసులో 2026కు బదులుగా 2025 సంవత్సరం
సవరించి తిరిగి నోటీసు అందజేసిన విపక్షాలు
-
Feb 10, 2026 20:17 IST
తిరుపతిలో కమల వికాసం మీద కామెంట్స్ చేశా: ఆదినారాయణ రెడ్డి
నేను నాలుగోసారి ఎమ్మెల్యే.. సొంత అభిప్రాయం చెప్పా.
మాదే రాజ్యం అని మాట్లాడేవారి కొవ్వు కరగతీయాలని చెప్పా.
నా ప్రాసను ప్రయాసగా మార్చారు...ఇది మహా తప్పు.
నా మాటల వల్ల బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నా.
-
Feb 10, 2026 20:14 IST
నంద్యాల: శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్.
భక్తులు సంయమనం పాటిస్తూ దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి.
ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు పోలీసుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి.
-
Feb 10, 2026 20:11 IST
కర్నూలు: ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్‌లో కలెక్టర్ సిరి తనిఖీ
సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ సిరి.
బస్టాండ్‌లో సౌకర్యాలు సరిగా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం.
డిపో మేనేజర్ మదిలేటిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశం.
-
Feb 10, 2026 19:53 IST
విశాఖ: హాల్ మార్కింగ్ సెంటర్‌పై బీఐఎస్ అధికారుల దాడులు
నకిలీ హాల్ మార్క్ ముద్రిస్తున్న వన్ టౌన్ హాల్ మార్కింగ్ సెంటర్.
సీసీటీవీ డేటా, కంప్యూటర్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్న అధికారులు.
లైసెన్స్ లేకుండా బీఐఎస్ హాల్ మార్క్ వేస్తున్న నిర్వాహకులు.
-
Feb 10, 2026 19:49 IST
తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష చూపిస్తోంది: మంత్రి తుమ్మల
నిధుల్లో కోత సమాఖ్య స్ఫూర్తిపై దాడి చేయటమే.
తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లింది రూ.1,33,208 కోట్లు.
కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది రూ.51 వేల కోట్లు మాత్రమే.
-
Feb 10, 2026 19:48 IST
రైతుల అప్పులపై లోక్‌సభలో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ ప్రకటన
మొదటి స్థానంలో ఏపీ, ఐదో స్థానంలో తెలంగాణ.
ఏపీ రైతులపై ఎక్కువ అప్పుల భారం.
-
Feb 10, 2026 19:45 IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు.
116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు ఎన్నికలు.
రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్.
-
Feb 10, 2026 19:44 IST
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో స్పీకర్ మర్యాదపూర్వక భేటీ.
అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించిన స్పీకర్.
-
Feb 10, 2026 19:25 IST
ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మేదమల్లి
అదనపు న్యాయమూర్తిగా రెండేళ్లపాటు కొనసాగనున్న బాలాజీ మేదమల్లి.
-
Feb 10, 2026 19:24 IST
రేపు వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయనున్న సీఎం రేవంత్.
-
Feb 10, 2026 19:23 IST
ఢిల్లీలో ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
కాసేపట్లో ఢిల్లీ నుంచి అమరావతికి సీఎం చంద్రబాబు.
-
Feb 10, 2026 19:22 IST
సభ్యుల హాజరుపై ఏపీ అసెంబ్లీ కీలక బులెటిన్ విడుదల
ఇకపై అసెంబ్లీలో సభ్యుల హాజరు డిజిటల్ పద్ధతిలో నమోదు.
రిజిస్టర్‌లో సభ్యులు సంతకం చేయాల్సిన అవసరం లేదని వెల్లడి.

-
Feb 10, 2026 18:37 IST
ఇటలీలో సినిమా రేంజ్‌లో దోపిడీ..
నగదు తీసుకెళ్తున్న వ్యాన్‌ను పేల్చి నగదు దోపిడీ.
డ్రైవర్, సెక్యూరిటీని బెదిరించి రూ. కోట్ల విలువైన యూరోలు ఎత్తుకెళ్లిన దొంగలు.
-
Feb 10, 2026 18:24 IST
కడప: రైల్వే కోడూరులో చోరీని ఛేదించిన పోలీసులు
రాఘవరాజుపురంలో ఓ ఇంట్లో బంగారు నగలు అపహరించిన పనిమనిషి.
అనసూయమ్మ, మురళి అనే ఇద్దరు అరెస్ట్.. బంగారు నగలు స్వాధీనం.
-
Feb 10, 2026 18:12 IST
ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ ప్రశంసలు
డైనమిక్ & విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు.
వ్యవసాయంలో ఏపీ 10 శాతం వృద్ధి సాధించింది.
కేంద్ర పథకాల అమలులో ఏపీ ముందంజలో ఉంది.
ఏపీలో ప్రకృతి సేద్యం వేగంగా విస్తరిస్తోంది.
-
Feb 10, 2026 18:12 IST
టీ20 ప్రపంచ కప్ 2026: యూఏఈపై న్యూజిలాండ్ విజయం
హాఫ్ సెంచరీలతో చెలరేగిన కివీస్ ఓపెనర్లు.
ఫిన్ అలెన్(84*), టిమ్ సీఫర్ట్(89*).
యూఏఈపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.
174 విజయ లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఛేదించిన కివీస్.
-
Feb 10, 2026 18:12 IST
తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు పరిశీలనలో ఉంది: కేంద్రం
బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఎంపీ ఈటల ప్రశ్నకు కేంద్రం సమాధానం
తెలంగాణ నుంచి రెండు బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వచ్చాయి.
లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం.
-
Feb 10, 2026 18:06 IST
హైదరాబాద్‌లో రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
ఫిబ్రవరి మొదటి వారంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై 19,163 కేసులు నమోదు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు.
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దని ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక.
-
Feb 10, 2026 17:49 IST
బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య
మైమెన్‌సింగ్ జిల్లాలో దారుణం.
బియ్యం వ్యాపారి సుషేన్ చంద్ర సర్కార్ హత్య.
-
Feb 10, 2026 17:41 IST
AI కంటెంట్‌పై కేంద్రం కీలక ప్రకటన
AI కంటెంట్‌పై లేబుల్ తప్పనిసరి చేసిన కేంద్రం.
AI కంటెంట్‌ను గుర్తించేందుకు ప్రత్యేక టూల్స్.
-
Feb 10, 2026 17:39 IST
ఢిల్లీ: సీఎం చంద్రబాబుతో నీతిఆయోగ్ సీఈఓ భేటీ
ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ.
-
Feb 10, 2026 17:37 IST
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం
అవిశ్వాస తీర్మానంపై ఫలితం వచ్చేవరకు సభకు హాజరుకాకూడదని నిర్ణయం.
-
Feb 10, 2026 17:33 IST
ఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చ.
-
Feb 10, 2026 16:52 IST
హైదరాబాద్: వనస్థలిపురం ఆటోనగర్ వద్ద రోడ్డు ప్రమాదం.
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన అంబులెన్స్.
అంబులెన్స్ డ్రైవర్, ఇద్దరు రోగులకు తీవ్ర గాయాలు.
-
Feb 10, 2026 16:48 IST
టీ20 ప్రపంచ కప్ 2026: న్యూజిలాండ్ టార్గెట్ 174
చెన్నై వేదికగా తలపడుతోన్న యూఏఈ-న్యూజిలాండ్.
నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసిన యూఏఈ.
కివీస్ విజయ లక్ష్యం 174 పరుగులు.
-
Feb 10, 2026 16:46 IST
డిజిటల్ అరెస్ట్ మోసాన్ని ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
రూ.1.07 కోట్ల సైబర్ మోసం కేసులో కీలక నిందితులు అరెస్ట్.
గుర్దీప్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్, కుమార్ మోహిత్ అరెస్ట్.
-
Feb 10, 2026 16:45 IST
తెలంగాణ ఈసీకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై ఫిర్యాదు.
ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపణ.
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఈసీకి జీవన్ రెడ్డి విజ్ఞప్తి.
-
Feb 10, 2026 16:29 IST
టీ20 ప్రపంచ కప్ 2026: సభ్య దేశాలపై అసోసియేట్ జట్ల దూకుడు
గ్రూప్ దశలోనే ఉర్రూతలూగిస్తోన్న అసోసియేట్ జట్ల ఆట తీరు.
సభ్య దేశాలను భయపెడుతోన్న యూఎస్ఏ, నెదర్లాండ్స్, నేపాల్.
-
Feb 10, 2026 16:25 IST
మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ రైడ్స్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్ పీఎస్ ఎస్‌ఐ వినయ్.
కేసులో సహకరిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ. 50వేలు డిమాండ్ చేసిన ఎస్‌ఐ.
లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ.
-
Feb 10, 2026 16:15 IST
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు
బాబ్రీ మసీదు పునర్నిర్మాణం సాధ్యం కాదు.
బాబ్రీ మసీదు పునర్నిర్మాణ యత్నాలను అడ్డుకుంటాం.
-
Feb 10, 2026 16:11 IST
మార్చి 5, 6, 7న ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా క్రీడా పోటీల నిర్వహణకు నిర్ణయం.
ట్రాక్ ఈవెంట్స్, సింగిల్ రన్నింగ్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు.
క్యారమ్, టేబుల్ టెన్నిస్, మిక్స్‌డ్ క్రికెట్ మ్యాచ్, కబడ్డీ పోటీలు.
త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, చెస్ పోటీల నిర్వహణకు నిర్ణయం.
అసెంబ్లీ ప్రాంగణంలో సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు పోటీలు.
-
Feb 10, 2026 16:06 IST
ఖైరతాబాద్ రైల్వే గేటు సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్య
రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్న యువకుడు.
కేసు నమోదు చేసుకున్న నాంపల్లి రైల్వే పోలీసులు.
-
Feb 10, 2026 16:04 IST
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటి అయిన సీఎం చంద్రబాబు
ఏపీ సంబంధిత అంశాలపై కేంద్రమంత్రితో చర్చ.
-
Feb 10, 2026 16:00 IST
రోహింగ్యాల అక్రమ వలసలపై తెలంగాణ హైకోర్టు విచారణ
హైదరాబాద్‌లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా ఉంటున్నారని పిటిషన్.
-
Feb 10, 2026 15:57 IST
నా పేరు మార్చి పిలుస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
మీరు రేవంత్ ఖాన్ అని మార్చుకోండి మాకు అభ్యంతరం లేదు.
కానీ.. మా తల్లి పెట్టిన పేరు మార్చడానికి మీరు ఎవరు?
సీఎం రేవంత్‌రెడ్డి మాపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు.
-
Feb 10, 2026 15:55 IST
ఎంపీ గౌరవ్ గొగొయ్‌పై అసోం సీఎం రూ.500 కోట్ల పరువునష్టం దావా
తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ సీఎం ఆరోపణ.
ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేతగా ఉన్న గౌరవ్ గొగొయ్.
-
Feb 10, 2026 15:49 IST
మధ్యప్రదేశ్: గ్వాలియర్ కలశ్ యాత్రలో తొక్కిసలాట
ఒకరు మృతి, పలువురికి తీవ్రగాయాలు.
-
Feb 10, 2026 15:43 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
208 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్.
68 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ.
-
Feb 10, 2026 15:35 IST
వికారాబాద్ కోర్టు సమీపంలోని రైల్వే గేట్ దగ్గర రోడ్డు ప్రమాదం.
బలంగా ఢీకొన్న రెండు కార్లు.. ముగ్గురికి గాయాలు.
ఒకరి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు.
-
Feb 10, 2026 15:32 IST
మైసూర్ శాండల్ సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నటి తమన్నా
రెండేళ్ల పాటు ప్రచారకర్తగా కొనసాగనున్న తమన్నా.
గతంలో తమన్నా నియామకంపై కన్నడిగుల నుంచి వ్యతిరేకత.
ఇప్పుడు మరోసారి తమన్నానే ఎంపిక చేసిన కర్నాటక ప్రభుత్వం.
-
Feb 10, 2026 15:21 IST
ఘూష్కర్ పండత్ సినిమా టైటిల్ వివాదం
బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం.
సినిమా టైటిల్ మార్చాలని నిర్మాతల నిర్ణయం.
ఢిల్లీ హైకోర్టుకు సమాచారం ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.
-
Feb 10, 2026 15:17 IST
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం
అవిశ్వాస తీర్మానంపై 118 మంది ఎంపీల సంతకాలు.
తీర్మానం నోటీసుపై సంతకం చేయని రాహుల్ గాంధీ.
అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకం చేయని టీఎంసీ, ఎన్‌సీపీ ఎంపీలు.
-
Feb 10, 2026 15:15 IST
గుంటూరు: అంబటి బెయిల్ పిటిషన్‌పై తీర్పు బుధవారానికి వాయిదా
మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానంపై ఆందోళన కేసులో బెయిల్ పిటిషన్.
బెయిల్ పిటిషన్‌ను విచారించిన స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు.
రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు.
-
Feb 10, 2026 15:11 IST
పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన శ్రీలంక అధ్యక్షుడు
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్‌తో మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న పీసీబీ
పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే.
-
Feb 10, 2026 15:04 IST
తిరుపతి: పాల వ్యాన్ ముసుగులో రేషన్ బియ్యం స్మగ్లింగ్.. వాహనం సీజ్.
చంద్రగిరి మండలం గాదంకి టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు.
పాల వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత.
తిరుపతి నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం.
-
Feb 10, 2026 15:03 IST
టీ20 ప్రపంచ కప్ 2026: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన యూఏఈ
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా తలపడనున్న యూఏఈ-న్యూజిలాండ్ జట్లు.
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ.
తొలుత ఫీల్డింగ్ చేయనున్న న్యూజిలాండ్.
-
Feb 10, 2026 15:01 IST
శివాలయాల్లో రద్దీపై ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు రివ్యూ
శ్రీశైలం ఆలయంలో వసతులపై సీఎం చంద్రబాబు సమీక్ష
శివరాత్రికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది: సీఎం చంద్రబాబు
అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
-
Feb 10, 2026 14:57 IST
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గం.
రిటైర్డ్ ఉద్యోగుల చావులకు మీ బాధ్యత లేదా.
రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే బకాయిలన్నీ చెల్లించండి.
-
Feb 10, 2026 14:55 IST
నారాయణపేట: బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతిపై స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి
రాజకీయాల కోసం బీజేపీ దుష్ప్రచారం తగదు: మంత్రి
మహదేవప్పను బెదిరించినట్లు రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం: మంత్రి
-
Feb 10, 2026 14:49 IST
విశాఖ: జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పివోడబ్ల్యూ, ఐఎఫ్‌టియూ సహా పలు సంఘాల నిరసన
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులపై బ్యాంక్ అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్.
-
Feb 10, 2026 14:47 IST
విజయవాడ: ఏపీ బీజేపీలో ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యల కలకలం.
ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ వివరణ.
బీజేపీ సమావేశంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడినా ఆయన వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవించడం లేదన్న మాధవ్.
ఆదినారాయణ రెడ్డి నుంచి వివరణ అడుగుతామని స్పష్టం చేసిన మాధవ్.
ఆయన వ్యక్తిగతంగానే కులపరమైన వ్యాఖ్యలు చేశారన్న మాధవ్.
-
Feb 10, 2026 14:44 IST
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం.
ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మాత్రమే ఈ సెలవు వర్తించనుంది.
-
Feb 10, 2026 14:41 IST
టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు హైదరాబాద్ భక్తుడు రూ.కోటి విరాళం
టీటీడీ చైర్మన్‌కు విరాళం చెక్కు అందజేసిన భక్తుడు గుత్తా శ్రీహర్షసాయి.
-
Feb 10, 2026 14:38 IST
టీ20 ప్రపంచ కప్ 2026: నమీబియాతో మ్యాచ్.. నెదర్లాండ్స్ ఘన విజయం
ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ ఘన విజయం.
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసిన నమీబియా.
ఛేదనలో 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి విజయం సాధించిన నెదర్లాండ్స్.
-
Feb 10, 2026 14:31 IST
విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
సీఎం చంద్రబాబుకు స్వయంగా చెప్పిన కేంద్రమంత్రి మనోహర్‌లాల్.
-
Feb 10, 2026 14:30 IST
ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయనిపిస్తోంది.
ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఫామ్‌హౌస్‌లు, మామిడి తోటల్లో ఎక్కడేం పెట్టారో విచారణ జరుపుతాం.
ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలి.
-
Feb 10, 2026 14:26 IST
మణిపూర్‌లో మళ్లీ హింస
ఉఖ్రుల్ లిటాన్‌లో కాల్పులు.
నాగాల ఇళ్లకు నిప్పు పెట్టిన వైనం.
ఐదురోజుల పాటు ఇంటర్నెట్ సేవలు బంద్.
అదనపు భద్రతా బలగాల మోహరింపు.
-
Feb 10, 2026 13:25 IST
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం
లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్.
అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ ఎంపీల సంతకాలు.
-
Feb 10, 2026 13:20 IST
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్ మినహా అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతాయి: డీజీపీ
కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 142 కేసులు నమోదు..
తనిఖీల్లో రూ.3 కోట్లకు పైగా నగదు స్వాధీనం: డీజీపీ శివధర్ రెడ్డి
-
Feb 10, 2026 13:19 IST
అమిత్ షాతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ..
సుమారు 50 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం..
ఏపీలో పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చించిన నేతలు..
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై భేటీలో చర్చ..
-
Feb 10, 2026 13:17 IST
యువతకు సీపీ సజ్జనార్ హెచ్చరిక..
బైక్‌పై స్టంట్లు చేస్తున్న యువతకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక..
బైక్‌ల మీద చేసే విన్యాసం.. నూరేళ్ల ఆయుష్షుకు వినాశనం..
చిన్న ప్రమాదమైనా జీవితాంతం మంచాన పడాల్సి వస్తుంది..
బాధ్యతగా డ్రైవ్ చేయండి: సీపీ సజ్జనార్
-
Feb 10, 2026 12:56 IST
టీ20 ప్రపంచ కప్ 2026: బీసీసీఐ కీలక నిర్ణయం
టోర్నీకి ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం..
ఆసీస్ చేతిలో 3-1తో భారత్ ఓడిపోవడంతో గతంలో ఈ నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
తాజాగా ఐసీసీ మెగా టోర్నీలో కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్న బీసీసీ..
-
Feb 10, 2026 12:53 IST
హైదరాబాద్ శివారులో భూప్రకంపనలు..
గాజుల రామారంలో భారీ శబ్దంతో భూప్రకంపనలు..
మెట్కాన్‌గూడెం పరిసరాల్లో కంపించిన భూమి..
ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనాలు..
భూకంపమా? లేదా పేలుడుతో వచ్చిన శబ్దమా అని ప్రజల ఆందోళన..
-
Feb 10, 2026 12:50 IST
టీ20 ప్రపంచ కప్2026: భారత్, పాక్ మ్యాచ్ ఎఫెక్ట్..
ముంబయి-కొలంబో మధ్య పెరిగిన ఫ్లైట్ టికెట్ ధరలు..
మ్యాచ్ ఖాయమైన నిమిషాల్లోనే రూ.10,000 పెరిగిన టికెట్ ధర..
ప్రస్తుతానికి రౌండ్ ట్రిప్ ధర రూ.60,000..
ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్, పాక్ మ్యాచ్..
-
Feb 10, 2026 12:45 IST
ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీల పరిధిలో రేపు సెలవు
తెలంగాణలో మున్సిపాలిటీల పరిధిలో రేపు సెలవు..
సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు..
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు సెలవు..
కార్మికులకు పెయిడ్ హాలిడేగా ప్రకటించిన ప్రభుత్వం..
-
Feb 10, 2026 12:31 IST
కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లతోనే అభ్యర్థి ఆత్మహత్య: ఎంపీ లక్ష్మణ్
బీజేపీ మక్తల్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య ఘటనను రాజ్యసభలో ప్రస్తావించిన ఎంపీ లక్ష్మణ్..
కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లతోనే ఎస్టీ అభ్యర్థి ఆత్మహత్య..
బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: ఎంపీ లక్ష్మణ్
-
Feb 10, 2026 12:24 IST
డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: బీజేపీ మక్తల్ కౌన్సిలర్ అభ్యర్థి మృతిపై డీజీపీ ఆఫీస్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన బీజేపీ
బీజేపీ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు..
బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు..
-
Feb 10, 2026 11:48 IST
తిరుమల లడ్డూ వివాదంపై ఈడీ కేసు నమోదు..
ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై ఈడీ కేసు నమోదు..
తిరుమల లడ్డూ వివాదంపై ఈడీ విచారణ ప్రారంభం..
PMLA యాక్ట్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు..
మనీ ట్రాన్స్‌ఫర్‌పై దృష్టి సారించనున్న ఈడీ అధికారులు..
-
Feb 10, 2026 09:40 IST
హాస్టళ్లపై సైబరాబాద్ పోలీసుల నిఘా..
హైదరాబాద్: PG హాస్టళ్లపై సైబరాబాద్ పోలీసుల నిఘా..
మియాపూర్ పీఎస్ పరిధిలో హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి..
హాస్టల్ యజమానులు, నిర్వాహకులతో అవగాహన సదస్సు..
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎస్.ఐ శివప్రసాద్
-
Feb 10, 2026 09:37 IST
ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు
ఢిల్లీ: ఉదయం 9.30కి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు నాయుడు..
ఉదయం 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న సీఎం..
మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ..
3 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ..
4 గంటలకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలవనున్న సీఎం చంద్రబాబు..
-
Feb 10, 2026 09:08 IST
భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌తో ఆందోళనలో బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు..
భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌తో ఆందోళనకు గురైన బంగ్లాదేశ్.
హడావుడిగా అమెరికాతో బంగ్లాదేశ్ ఒప్పందం..
బంగ్లాదేశ్‌పై టారిఫ్‌లను 19 శాతానికి తగ్గించిన అమెరికా..
-
Feb 10, 2026 08:55 IST
శ్రీశైలంలో మూడో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
నంద్యాల : శ్రీశైలంలో మూడో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
నేడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు..
సాయంత్రం హంస వాహనంపై ఆశీనులై పూజలందుకోనున్న స్వామిఅమ్మవార్లు..
రాత్రి గ్రామోత్సవం నిర్వహించనున్న ఆలయ అధికారులు..
-
Feb 10, 2026 08:39 IST
మక్తల్ మునిసిపాలిటీలో విషాదం..
నారాయణపేట: మక్తల్ మునిసిపాలిటీలో విషాదం..
ఉరేసుకుని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్య..
ప్రత్యర్థుల వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ..
నామినేషన్ వేసిన రోజు నుంచి వేధిస్తున్నారని ఆవేదన..
ఓటమి భయంతో కాంగ్రెస్ దుశ్చర్యలకు పాల్పడుతోంది: డీకే అరుణ
-
Feb 10, 2026 08:35 IST
హుస్సేన్‌సాగర్‌లో దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య..
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం ఆత్మహత్య..
భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన సీతారాం..
తన మృతికి భార్య, అత్తమామలే కారణమంటూ వాట్సాప్‌లో స్టేటస్..
మృతుడు సీతారాం స్వస్థలం ఏపీలోని మార్కాపురం..
-
Feb 10, 2026 07:13 IST
టీ20 వరల్డ్‌కప్‌కు బంగ్లా దూరం కావడంపై ఐసీసీ విచారం
బంగ్లాదేశ్ గైర్హాజరు కావడం దురదృష్టకరమన్న ఐసీసీ..
బంగ్లాదేశ్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ప్రకటన..
ఐసీసీ సభ్య దేశంగా బంగ్లాదేశ్ కొనసాగుతుందని వెల్లడి..
-
Feb 10, 2026 07:11 IST
నేడు విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం..
సాయంత్రం 4.30 గంటలకు భేటీ కానున్న పార్లమెంటరీ కమిటీ..
భారత్-అమెరికా, భారత్-ఈయూ ఒప్పందాలపై చర్చ..
భారత్-బంగ్లా సంబంధాలపై కూడా చర్చించనున్న కమిటీ..
-
Feb 10, 2026 06:47 IST
లోక్‌సభ స్పీకర్‌పై నేడు అవిశ్వాసం పెట్టే యోచనలో విపక్షాలు..
అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్, లోక్‌సభ విపక్ష ఎంపీల సంతకాలు..
నేడు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ఎంపీలు..
ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై 103 మంది ఎంపీల సంతకాలు..
8 మంది సభ్యులను సస్పెండ్ చేయడంపై విపక్షాల ఆగ్రహం..
-
Feb 10, 2026 06:45 IST
భారత్‌తో మ్యాచ్‌పై పాకిస్థాన్ యూటర్న్..
టీ20 వరల్డ్‌కప్: భారత్‌తో మ్యాచ్‌పై పాకిస్థాన్ యూటర్న్..
భారత్‌తో మ్యాచ్ ఆడాలని పీసీబీకి పాకిస్థాన్ ఆదేశం..
ఈ నెల 15న కొలంబోలో భారత్ Vs పాకిస్థాన్ మ్యాచ్..
-
Feb 10, 2026 06:31 IST
మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు రేపే
రేపు తెలంగాణలో 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్..
బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్, ఈ నెల 13న ఎన్నికల కౌంటింగ్..
2,996 వార్డులకు 8,203 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..
బరిలో 12,993 మంది అభ్యర్థులు, పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్..
తెలంగాణలో ఓటు వేయనున్న 52.43 లక్షల మంది ఓటర్లు..
-
Feb 10, 2026 06:06 IST
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..
రంగారెడ్డి: రాజేంద్రనగర్ ఉప్పరపల్లి మారుతీ సుజుకీ సర్వీస్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం..
దట్టంగా అలుముకున్న పొగ, ప్రమాదంలో పలు కార్ల దగ్ధం..
మంటలార్పిన ఫైర్ సిబ్బంది, అగ్నిప్రమాదంపై ఆరా తీస్తున్న పోలీసులు..