హైదరాబాద్ శివారులో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:15 PM
హైదరాబాద్ శివారులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గాజులరామారంలో భారీ శబ్దంతో భూమి కంపించింది. మెట్కాన్‌గూడెం పరిసరాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి..
ఇంటర్‌నెట్ డెస్క్: హైదరాబాద్ శివారులో భూప్రకంపనలు సంభవించాయి. గాజుల రామారంలో భారీ శబ్దంతో భూప్రకంపనలు వచ్చాయి. మెట్కాన్‌గూడెం పరిసరాల్లో కూడా భూమి కంపించింది. భూప్రకంపనల నేపథ్యంలో జనాలు భయంతో ఇళ్ల నుంచి రోడ్డు మీదకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, అది భూకంపమా? లేదా పేలుడుతో వచ్చిన శబ్దమా అన్నది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
దయచేసి మా దేశంపై దాడి చేయండి.. ట్రంప్‌ను అభ్యర్థించి ఇరాన్ వ్యక్తి ఆత్మహత్య..
మహాశివరాత్రికి 618 బస్సుల ఏర్పాటు