Share News

టీ20 ప్రపంచ కప్ 2026: నమీబియాతో మ్యాచ్.. నెదర్లాండ్స్ ఘన విజయం

ABN , Publish Date - Feb 10 , 2026 | 02:34 PM

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఆటను ముగించింది.

టీ20 ప్రపంచ కప్ 2026: నమీబియాతో మ్యాచ్.. నెదర్లాండ్స్ ఘన విజయం
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఆటను ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ (42; 38 బంతుల్లో, 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), జాన్‌ ఫ్రైలింక్‌ (30; 26 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్‌), జేజే స్మిత్‌ (22; 15 బంతుల్లో, 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) రాణించారు. మిగతా బ్యాటర్లు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో లోగాన్‌ వాన్‌ బీక్‌, బాస్‌ డీ లీడే తలో రెండు, ఆర్యన్‌ దత్‌, ఫ్రెడ్‌ క్లాసెన్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.


157 పరుగుల ఛేదనలో నెదర్లాండ్స్ బ్యాటర్లు అదరగొట్టారు. బాస్ డీ లేడే(72; 48 బంతుల్లో, 5 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోలిన్‌ అకెర్మాన్‌ (32; 28 బంతుల్లో, 1 సిక్స్‌), మిచెల్‌ లివిట్‌ (28; 15 బంతుల్లో, 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) రాణించారు. చివర్లో కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (18*; 9 బంతుల్లో, 1 ఫోర్‌, 1 సిక్స్‌) వేగంగా పరుగులు రాబట్టాడు. నమీబియా బౌలర్లలో బెర్నార్డ్‌, రూబెన్‌, జాన్‌ నికోల్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.


Also Read:

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!

Updated Date - Feb 10 , 2026 | 02:35 PM