Share News

టీ20 ప్రపంచ కప్: ఈసారి కూడా పాకిస్థాన్‌ను ఓడిస్తాం: అమెరికా

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:09 PM

టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా ఇవాళ గ్రూప్- ఏ నుంచి పాకిస్థాన్, అమెరికా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్ఏ ప్లేయర్ పాక్ జట్టుకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ సారి కూడా పాకిస్థాన్‌ను ఓడిస్తామని తెలిపాడు.

టీ20 ప్రపంచ కప్: ఈసారి కూడా పాకిస్థాన్‌ను ఓడిస్తాం: అమెరికా
USA vs Pakistan T20 World Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: ఇవాళ(మంగళవారం)టీ20 ప్రపంచకప్‌(World Cup-2024)లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్‌-ఏ నుంచి పాకిస్థాన్‌- అమెరికా జట్లు తలపడనున్నాయి. కొలంబోలోని సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అమెరికా, పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ మంగళవారం రాత్రి 7.00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అమెరికా జట్టు పాక్ తో మైండ్ గేమ్ ప్రారంభించింది. పాకిస్థాన్ ను ఓడిస్తామంటూ అమెరికా ఆటగాడు మొహమ్మద్‌ మొహ్సిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత వరల్డ్ కప్ లో తాము పాక్‌ను ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు.


మీడియాతో మొహమ్మద్‌ మొహ్సిన్‌(Mohammad Mohsin) మాట్లాడుతూ.. ‘ భారత్ తో జరిగిన గత మ్యాచ్‌లోని సానుకూల అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాము. అలానే గత మ్యాచ్ లో మేము చేసిన చిన్న చిన్న లోపాలను సరి చేసుకుంటాము. ఇక పాకిస్థాన్‌ను ఇప్పటికే ఒకసారి మేము ఓడించాము. కాబట్టి వారి మీదే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ టోర్నీలో మేము పెద్దగా కోల్పోయేది ఏమి ఉండదు. ప్రస్తుతం ఈ ఐసీసీలో మా జర్నీని పూర్తిగా ఆస్వాదిస్తున్నాము. భారత్ తో జరిగిన మ్యాచ్ లో గట్టిపోటీ ఇచ్చి.. టోర్నీని మెరుగ్గా ఆరంభించాము. ఇక పాకిస్థాన్‌పై మరోసారి గెలుస్తామనే అనుకుంటున్నాం. మా జట్టు గతం కంటే ఇప్పుడు చాలా బలంగా ఉంది. అందుకే పాక్‌ను ఓడిస్తామనే నమ్మకం పెరిగింది. గత మ్యాచ్‌ కంటే ఈసారి రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతాము’ అని మొహ్సిన్‌ వెల్లడించారు.


పాక్‌ను ఓడించిన అమెరికా..

గతంలో పాకిస్థాన్ జట్టును అమెరికా(USA) ఓడించింది. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ లీగ్‌ దశలో పాక్‌పై యూఎస్ఏ సంచలన విజయం సాధించింది. నాడు డల్లాస్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 7 వికెట్ల నష్టానికి159 పరుగులు చేసింది. అమెరికా కూడా మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు సాధించింది. దీంతో మ్యాచ్‌ టై కాగా జరిగిన సూపర్ ఓవర్‌లో పాక్‌పై అమెరికా గెలుపొందింది. దీంతో అమెరికా తొలిసారి సూపర్‌-8కు చేరగా.. పాక్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.


Also Read:

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!

Updated Date - Feb 10 , 2026 | 01:12 PM