Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 05 , 2026 | 06:05 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 05, 2026 21:32 IST

    ఢిల్లీ: ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

    • ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

  • Aug 05, 2026 20:09 IST

    ఢిల్లీ: విద్యార్థులతో రాహుల్‌గాంధీ సమావేశం

    • విద్యార్థులు ఎలాంటి దాడులు చేయలేదు: రాహుల్‌

    • ఇప్పటికీ విద్యార్థులను పోలీసులు వేధిస్తున్నారు: రాహుల్

    • విద్యార్థులు ఎవరికీ క్షమాపణలు చెప్పనక్కర్లేదు: రాహుల్

    • దేశ భవిష్యత్‌ను విద్యార్థులే నిర్ణయిస్తారు: రాహుల్‌

  • Aug 05, 2026 19:37 IST

    హైదరాబాద్: తెలంగాణ రైతుల నీటి హక్కులు కాపాడతాం: మంత్రి ఉత్తమ్‌

    • బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు: ఉత్తమ్‌

    • పోలవరం, పట్టిసీమ, రాయలసీమ ఎత్తిపోతల పనులు మీ హయాంలోనే జరిగాయి: మంత్రి ఉత్తమ్‌

    • తెలంగాణ ప్రయోజనాలపై రాజీపడేది లేదు: ఉత్తమ్‌

  • Aug 05, 2026 19:03 IST

    హైదరాబాద్‌: గచ్చిబౌలి మార్గంలో భారీగా ట్రాఫిక్‌జామ్‌

    • ఆఫీస్‌ క్లోజింగ్‌ సమయంలో కురిసిన వర్షం

    • ఐకియా దగ్గర కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

    • ట్రాఫిక్‌జామ్‌తో వాహనదారుల ఇక్కట్లు

  • Aug 05, 2026 19:02 IST

    నిజామాబాద్‌: త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌

    • పార్టీ కోసం కష్టపడిన వారికే తొలి ప్రాధాన్యం: మహేశ్ గౌడ్‌

  • Aug 05, 2026 18:30 IST

    కృష్ణా: మచిలీపట్నం చోరీ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్‌

    • జులై 26న గాంధీనగర్‌లోని యాకూబ్ ఇంట్లో చోరీ

    • 100 గ్రాముల బంగారం అపహరణ

  • Aug 05, 2026 17:45 IST

    విజయవాడ కనకదుర్గమ్మకు ఆషాఢం సారే సమర్పించిన సీపీ వి రాజశేఖర్ దంపతులు

    • వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సారేతో ఊరేగింపు

    • పోలీస్ సిబ్బందితో కలిసి అమ్మవారి ఆలయానికి చేరుకున్న సీపీ

    • నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి సారే సమర్పించిన పోలీసులు

    • ఘనంగా ఆషాఢం సారే ఏర్పాట్లు చేసిన పోలీస్ సిబ్బంది

    • అమ్మవారికి సారే సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందన్న సీపీ

    • విజయవాడ సీపీగా రావడం.. సారే సమర్పించడం అదృష్టమన్న రాజశేఖర్ బాబు

  • Aug 05, 2026 17:41 IST

    హైదరాబాద్‌లో వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి ఆఫీస్‌ ప్రారంభం

    • వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

    • భారత్-రష్యా ప్రజల స్నేహ, సహకార సంబంధాలు బలోపేతం కావాలని మంత్రి సీతక్క ఆకాంక్ష

    • ప్రపంచ శాంతి, ప్రజల మధ్య ఐక్యతకు ఇలాంటి వేదికలు దోహదపడతాయన్న మంత్రి సీతక్క

  • Aug 05, 2026 17:35 IST

    ఎర్ర సముద్రంలో భారత నౌకపై దాడి

    • భారత నావికుల భద్రతపై ఫార్వర్డ్ సీమన్స్ యూనియన్(FSUI) ఆందోళన

    • ప్రధాని మోదీకి ఫార్వర్డ్ సీమన్స్ యూనియన్ విజ్ఞప్తి

    • భారత నావికాదళాన్ని రంగంలోకి దించాలని డిమాండ్

    • ఘర్షణ ప్రాంతాల్లో భారత నౌకలకు రక్షణ కల్పించాలని కోరిన యూనియన్

  • Aug 05, 2026 17:22 IST

    కర్ణాటకలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం

    • మహర్షి వాల్మీకి ఎస్టీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బసనగౌడ రాజీనామా

    • సీఎం డీకే శివకుమార్‌కు రాజీనామా లేఖ పంపిన బసనగౌడ

  • Aug 05, 2026 17:21 IST

    అమరావతి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

    • దక్షిణ కర్ణాటకపై కొనసాగుతున్న మరో ఉపరితల ఆవర్తనం

    • తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం

  • Aug 05, 2026 17:14 IST

    ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ పెట్టుబడుల ప్రవాహం

    • ఏపీకి పెట్టుబడులపై లోక్‌సభలో లెక్కలతో సహా స్పష్టం చేసిన కేంద్రం

    • లోక్‌సభలో వైసీపీ ఎంపీ ప్రశ్నకు స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

    • జగన్ హయాం కంటే కూటమి పాలనలో భారీగా విదేశీ పెట్టుబడులు

    • 2023-24లో రూ.760 కోట్ల FDIలు (92.13 మిలియన్ డాలర్లు)

    • 2024-25 నాటికి FDIల మొత్తం 233.14 మిలియన్ డాలర్లకు చేరిక

    • 2025-26 నాటికి ఏకంగా రూ.5వేల కోట్లకు చేరిన FDIలు

  • Aug 05, 2026 16:51 IST

    ప్రధాని మోదీకి జుకర్‌బర్గ్‌ క్షమాపణ

    • ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన జుకర్‌బర్గ్‌

    • ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై క్షమాపణ

    • CSAM, డీప్‌ఫేక్‌ కంటెంట్‌ వ్యాప్తిపై విచారం

    • కొన్ని రకాల కంటెంట్‌ను బూస్ట్‌ చేయడానికి భారీగా డబ్బులు తీసుకున్నట్టు అంగీకరించిన మెటా

  • Aug 05, 2026 16:46 IST

    హైదరాబాద్: టీ-ఫైబర్‌పై సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

    • ప్రభుత్వ శాఖలన్నీ తప్పనిసరిగా టీ-ఫైబర్ నెట్‌వర్క్‌కే మారాలి

    • ప్రైవేట్ ఇంటర్నెట్ సేవల నుంచి టీ-ఫైబర్‌కు మారాలని సీఎస్‌ ఆదేశం

    • సెప్టెంబర్ 5లోపు మైగ్రేషన్ నివేదిక సమర్పించాలని సీఎస్ ఆదేశం

  • Aug 05, 2026 16:13 IST

    విజయవాడ: సీఐ నాగరాజు ఏడు రోజుల సిట్‌ కస్టడీ పూర్తి

    • సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నాగరాజును ప్రశ్నించిన సిట్‌

    • వైద్య పరీక్షలకు సీఐ నాగరాజు ప్రభుత్వాస్పత్రికి తరలింపు

    • కాసేపట్లో నాగరాజును కోర్టులో హాజరుపరచనున్న సిట్‌

  • Aug 05, 2026 16:12 IST

    అమరావతి: హోంమంత్రి అనిత అధ్యక్షతన కీలక సమావేశం

    • అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సమస్యలు, కేసుల పురోగతిపై చర్చ

    • పాల్గొన్న మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్‌

    • వర్చువల్‌గా పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్‌

  • Aug 05, 2026 15:52 IST

    అమెరికాపై ఇరాన్ యుద్ధ ప్రభావం, తగ్గుతున్న క్షిపణుల నిల్వలు

    • ఇప్పటికే 80 శాతం కరిగిపోయిన ఇంటర్‌సెప్టర్లు

    • 50 శాతం తగ్గిన పేట్రియాట్‌ ఇంటర్‌సెప్టర్లు

    • యూఎస్ ఆయుధ సంపత్తిపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు

  • Aug 05, 2026 15:50 IST

    చివర్లో లాభపడిన సూచీలు..

    • 152 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్

    • 9 పాయింట్ల లాభంలో నిఫ్టీ

    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.12గా ఉంది

  • Aug 05, 2026 15:34 IST

    ప్రకాశం: కొరిశపాడు మండలం తిమ్మనపాలెంలో భారీ చోరీ

    • ఓ ఇంట్లో చొరబడి నగలు, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

    • 16 సవర్ల బంగారం, 2 కిలోల వెండి, రూ.4 లక్షల నగదు అపహరణ

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Aug 05, 2026 15:32 IST

    హైదరాబాద్‌: గుడిమల్కాపూర్‌లో దారుణం

    • నాలుగేళ్ల బాలుడిపై తీవ్రంగా దాడి చేసిన తండ్రి

    • బాలుడి తలను పిల్లర్‌కు కొట్టిన తండ్రి సల్మాన్‌

    • బాలుడిని లారీ కిందకు నెట్టేసే ప్రయత్నం

    • బాలుడు అర్మాన్‌ను కాపాడిన స్థానికులు

    • అర్మాన్‌ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు

    • తండ్రి సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Aug 05, 2026 15:27 IST

    అమరావతి: జగన్‌ వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్‌

    • పొగాకు రైతుల పట్ల జగన్‌కు చిత్తశుద్ధి లేదు: అచ్చెన్నాయుడు

    • జగన్ అబద్ధాలకు ఈసారి గట్టి సమాధానం ఇస్తాం: అచ్చెన్న

    • జగన్ బయటకు వస్తే అరాచకాలే-అచ్చెన్నాయుడు

  • Aug 05, 2026 15:26 IST

    మహారాష్ట్ర: కాక్రోచ్‌ జనతా పార్టీ కోర్‌ కమిటీ సమావేశం

    • భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించిన నేతలు

    • దేశమంతా ఉద్యమాన్ని విస్తరించాలని నిర్ణయం

    • రాజకీయ పార్టీ స్థాపించే ఉద్దేశం లేదు: అభిజీత్‌ దీప్కే

    • దేశానికి ప్రెషర్‌ గ్రూప్‌ అవసరం ఉంది: దీప్కే

  • Aug 05, 2026 15:06 IST

    ఢిల్లీ: విపక్ష నేత రాహుల్‌ గాంధీతో కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు భేటీ

    • డీలిమిటేషన్‌ బిల్లుకు సహకరించాలని రిజిజు విజ్ఞప్తి

    • మహిళా రిజర్వేషన్‌ సవరణ బిల్లుపైనా సహకారం కోరిన రిజిజు

    • ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రాహుల్‌ గాంధీ

    • రామమందిరం విరాళాల వ్యవహారంపై చర్చకు రాహుల్‌ డిమాండ్‌

    • విద్యార్థులపై పోలీసుల చర్యపై అమిత్‌ షా ప్రకటనకు డిమాండ్‌

    • ఈ అంశాలపై చర్చ జరిగే వరకు సభలో కార్యకలాపాలు వద్దన్న రాహుల్‌

  • Aug 05, 2026 14:55 IST

    భద్రాద్రి కొత్తగూడెం: తగ్గుముఖం పట్టిన గోదావరి

    • భద్రాచలం వద్ద 26.90 అడుగులకు చేరిన నీటిమట్టం

    • 3,45,371 క్యూసెక్కుల నీటి ప్రవాహం

  • Aug 05, 2026 14:51 IST

    హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్స్..

    • హరీశ్ రావుపై క్షుద్ర పూజల ఆరోపణలకు కట్టుబడి ఉన్నా..

    • లీగల్ నోటీసులకు సమాధానం ఇస్తా..

    • హరీశ్ రావు గుడిలో ఏం పూజలు చేశారో స్పష్టత ఇవ్వాలి..

    • ఇలాంటి పూజలు ప్రజలకు శ్రేయస్కరం కాదు: మహేశ్ గౌడ్‌

  • Aug 05, 2026 14:38 IST

    కేంద్రం సమన్లకు స్పందించిన ఫేస్‌బుక్ యాజమాన్యం

    • మెటా గ్లోబల్ బృందంతో కేంద్ర ఐటీ శాఖ అత్యున్నత భేటీ

    • ప్రధాని పోస్ట్ తొలగింపు, చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై స్పష్టత కోరిన కేంద్రం

    • సాంకేతిక లోపాలు, అల్గోరిథం పక్షపాతంపై ప్రశ్నించిన కేంద్రం

    • మెటా సాంకేతిక లోపం వాదనను తోసిపుచ్చిన కేంద్రం

    • నిష్పాక్షిక విచారణ నివేదిక ఇవ్వాలని మెటాకు కేంద్రం ఆదేశం

  • Aug 05, 2026 14:33 IST

    ఢిల్లీ: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు కేంద్రం యోచన

    • డీలిమిటేషన్ బిల్లుపై చర్చకు ప్రత్యేక సమావేశాలు

    • ఆగస్ట్ 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక సెషన్‌కు యోచన

    • మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టే చాన్స్

  • Aug 05, 2026 14:32 IST

    ఢిల్లీ: పార్లమెంట్‌లో గందరగోళానికి తెరదించేందుకు కేంద్రం ముమ్మర యత్నాలు

    • లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజీజు భేటీ

    • రాహుల్ గాంధీ ఛాంబర్‌లో 50 నిమిషాల పాటు సమావేశం

    • పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్

  • Aug 05, 2026 13:50 IST

    యూపీలోని హద్రస్‌లో 5.6టన్నుల చిల్లర నాణేల స్వాధీనం

    • నాణేలను అక్రమంగా నిల్వ చేసిన స్టేషనరీ వ్యాపారి

    • పరారీలో వ్యాపారి నవీన్‌కుమార్, గాలిస్తున్న పోలీసులు

    • వ్యాపారిపై 'కాయినేజ్ యాక్ట్ 2011' కింద కేసు నమోదు

    • కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేసిన యూపీ ప్రభుత్వం

    • నాణేలు ఎక్కడికి సరఫరా చేస్తున్నారనే కోణంలో విచారణ

  • Aug 05, 2026 13:46 IST

    తూ.గో.: దేవరపల్లి పొగాకు కేంద్రంలో వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం

    • పొగాకు బేళ్లను తొక్కేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు

    • వేలానికి పనికిరాకుండా పాడైపోయిన పొగాకు బేళ్లు

    • వైసీపీ నేతల తీరుపై రైతుల ఆగ్రహం

  • Aug 05, 2026 13:25 IST

    సంసద్ చలో’ మార్చ్ ఉద్రిక్తతలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    • ఆందోళనల సమయంలో భద్రతా బలగాలు సంయమనం పాటించాలి: CJI జస్టిస్ సూర్యకాంత్

    • రాళ్లు విసిరినా యువతపై కఠినంగా వ్యవహరించవద్దు: : CJI జస్టిస్ సూర్యకాంత్

    • కౌన్సెలింగ్ ఇచ్చి శాంతింపజేయడమే ప్రభుత్వాల బాధ్యత:: CJI జస్టిస్ సూర్యకాంత్

    • నిరసనకారుల సమస్యను వినడమే బలమైన ఆయుధం: : CJI జస్టిస్ సూర్యకాంత్

  • Aug 05, 2026 13:06 IST

    జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: ఎక్స్‌లో ప్రధాని మోదీ

    • ప్రతి పౌరుడూ వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామి కావాలి: ప్రధాని మోదీ

    • ఆర్టికల్స్ 370, 35(A) రద్దుతో కొత్త అధ్యాయం: ప్రధాని మోదీ

    • జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో మౌలిక సదుపాయాల విస్తరణ: ప్రధాని మోదీ

    • విద్య, వైద్యం, క్రీడలు, పారిశ్రామిక రంగాల్లో అవకాశాలు పెరిగాయి: ఎక్స్‌లో ప్రధాని మోదీ

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 13:04 IST

    అమిత్‌షాతో పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరిణ్‌ రిజిజు భేటీ

    • పార్లమెంట్‌ ప్రతిష్ఠంభన పరిష్కారంపై చర్చ

    • ఇప్పటికే రాహుల్‌, ప్రియాంకతో సమావేశమైన కిరణ్‌రిజిజు

    • పార్లమెంట్‌ ప్రతిష్ఠంభన త్వరలో ముగుస్తుందని ఆశాభావం

    • అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేయలేదన్న రాహుల్

  • Aug 05, 2026 12:38 IST

    ఢిల్లి: ప్రధాని మోదీని తిడితే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా?: సీఎం రేవంత్‌

    • సోషల్ మీడియాలో దూషణలపై మా ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేసింది: సీఎం రేవంత్‌ రెడ్డి

    • బీజేపీ నేతలు కూడా అసభ్యంగా దూషిస్తున్నారు: రేవంత్‌ రెడ్డి

    • CJP, విద్యార్థులను అంతకంటే ఎక్కువే దూషించారు: సీఎం రేవంత్‌ రెడ్డి

  • Aug 05, 2026 12:25 IST

    వ్యాపారిని వెంటాడి దాడి చేసిన రష్యన్ డ్రోన్

    • వద్దని వేడుకుంటున్నా కనికరించని డ్రోన్

    • షాకింగ్ వీడియోను షేర్ చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

    • దాడిలో తీవ్రగాయాలపాలైన వ్యాపారి

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 12:20 IST

    తెలంగాణకు ద్రోహం జరుగుతుంటే రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారు: హరీశ్ రావు

    • గురుదక్షిణ చెల్లించడం కోసం రేవంత్ మౌనంగా ఉన్నారా?: మాజీ మంత్రి హరీశ్ రావు

    • పక్క రాష్ట్రాలు కుట్రలు పన్నుతుంటే మౌనం ఎందుకు?: హరీశ్ రావు

    • రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం ఉంది: హరీశ్ రావు

    • కాళేశ్వరం అనుమతులు రద్దు చేయడమంటే.. సగం తెలంగాణకు అన్యాయం చేయడమే: హరీశ్ రావు

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 11:54 IST

    తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి విల్సన్

    • ప్రభుత్వాస్పత్రిలో పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరం

    • మేనమామ బంగారు కానుక పథకానికి రూ.560 కోట్లు

    • ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులకు రూ.125 కోట్లు

    • జెన్‌ జీ విద్యార్థులకు రూ.2వేల కోట్ల కేటాయింపు

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 11:34 IST

    మేడ్చల్: దుండిగల్ పీఎస్ పరిధిలో గంజాయి చాక్లెట్ల పట్టివేత

    • 350 గ్రాముల 71 గంజాయి చాక్లెట్ల స్వాధీనం, కేసు నమోదు

    • బిహార్‌కు చెందిన రంజిత్ కుమార్ అరెస్ట్

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 11:31 IST

    తూ.గో.: జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం

    • వడ్డీతో సహా చెల్లిస్తాం.. జగన్ 2.0 లోడింగ్ ఫ్లెక్సీలతో వీరంగం

    • బైక్‌లకు సైలెన్సర్లు తొలగించి రచ్చ చేస్తున్న వైసీపీ కార్యకర్తలు

  • Aug 05, 2026 11:31 IST

    దుబాయ్‌లో వరుస పేలుళ్లు

    • జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో పేలుళ్లు

    • 20 నిమిషాల్లో 7 చోట్ల పేలుళ్లు

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 11:25 IST

    ఐపీఎల్‌కు ముందే తొలి టీ20 మ్యాచ్ ఆడిన కోహ్లీ!

    • 18 ఏళ్ల వయసులోనే దేశవాళీ టోర్నీలో ఆడిన విరాట్ కోహ్లీ

    • ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కింగ్

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 11:08 IST

    లోక్‌సభ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా

    • విపక్షాల ఆందోళనతో వాయిదా వేసిన స్పీకర్

  • Aug 05, 2026 11:00 IST

    హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ

    • రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన 8 ప్రైవేట్ కాలేజీలు

    • హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ NOCలు సృష్టించిన కాలేజీలు

    • ఇంటర్ బోర్డుకు సబ్‌మిట్ చేసిన 8 కాలేజీలు

    • 8 కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు

    • లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 10:47 IST

    ఢిల్లీ: కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

    • సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్, ఎంపీలు

    • తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చ

  • Aug 05, 2026 10:44 IST

    సోషల్ మీడియా వైఖరిపై పార్లమెంటరీ కమిటీ సీరియస్

    • మోదీ వీడియో తొలగింపుపై కమిటీ తీవ్ర ఆగ్రహం

    • అభ్యంతరకర కంటెంట్ తొలగించాలని కమిటీ ఆదేశం

    • 3 రోజుల్లో కంటెంట్ తొలగించాలని మెటాకు అల్టిమేటం

    • బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న పార్లమెంటరీ ప్యానల్

    • లేదంటే చట్టపరమైన రక్షణ కోల్పోతారని హెచ్చరిక

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 10:38 IST

    హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో దారుణం

    • నాలుగేళ్ల కొడుకుపై తండ్రి అమానుష దాడి

    • కొడుకు తలను పిల్లర్‌కు కొట్టి హతమార్చిన వైనం

    • హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 05, 2026 10:32 IST

    విశాఖలో మంత్రి నారా లోకేశ్ పర్యటన

    • అరిలోవలో పీవీ సింధు అకాడమీ పనులకు భూమిపూజ చేసిన లోకేశ్

    • పాల్గొన్న మంత్రి రాంప్రసాద్, రాష్ట్ర టీడీపీ చీఫ్ పల్లా తదితరులు

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 10:28 IST

    ఇరాన్ సుప్రీం లీడర్‌, అధ్యక్షుడి మధ్య మరింత ఎడం?

    • ఇటీవల ఇరు నేతల మధ్య అత్యంత గొప్యంగా సమావేశం

    • చిమ్మచీకటిలో ఒకరికొకరు కనబడని స్థితిలో మాట్లాడుకున్న నేతలు

    • సుప్రీం లీడర్‌తో కరచాలనానికి అధ్యక్షుడికి అనుమతి నిరాకరణ

    • ఆగ్రహంతో అధ్యక్షుడు వెనుదిరిగినట్టు స్థానిక మీడియాలో వార్తలు

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 10:27 IST

    కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఏడుగురు అథ్లెట్ల అదృశ్యం

    • గ్లాస్గో పోటీల తర్వాత స్వదేశానికి చేరుకోని అథ్లెట్లు

    • అదృశ్యమైన వారిలో పాకిస్థాన్ బాక్సర్ సహా ఏడుగురు

    • దర్యాప్తు చేపట్టిన స్కాట్లాండ్ పోలీసులు

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 10:14 IST

    రెపో రేటు యథాతథం

    • రెపో రేటును 5.25శాతంగా ఉంచిన RBI

    • న్యూట్రన్ ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తున్నాం: RBI

    • ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంది: RBI

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 10:14 IST

    జంతర్ మంతర్ CJP నిరసనల్లో ఉగ్ర కుట్ర

    • నలుగురు మైనర్లు సహా మొత్తం 9 మంది అరెస్ట్

    • 3 తుపాకులు, 4 పెట్రోల్ బాంబుల స్వాధీనం

    • ISI ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నట్టు గుర్తింపు

    • 8 మంది జంతర్‌ మంతర్ నిరసనల్లో పాల్గొన్నట్టు గుర్తింపు

    • నిరసనల్లో దాడి యత్నం విఫలమైనట్టు వెల్లడి

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 09:59 IST

    హైదరాబాద్: హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాం: అద్దంకి దయాకర్

    • హరీశ్ రావు లీగల్ నోటీసులకు లీగల్‌గానే సమాధానం చెబుతాం: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

    • BRS హయాంలో లీగల్ నోటీసులు కాదు.. జైళ్లల్లో పెట్టినా పోరాటాలు చేశాం

    • హరీశ్ రావు ఎందుకు భయపడుతున్నారు?: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 09:34 IST

    విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు.. సిట్ కస్టడీకి కానిస్టేబుళ్లు

    • సిట్ కస్టడీకి కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్య

    • 5 రోజుల పాటు కస్టడీకి విజయవాడ కోర్టు అనుమతి

    • వారం రోజుల కస్టడీలో ఎలాంటి సమాధానాలు ఇవ్వని నాగరాజు

  • Aug 05, 2026 09:32 IST

    విశాఖ: వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ ఇంట్లో ఈడీ సోదాలు

    • విజయప్రసాద్‌కు చెందిన వెల్ఫేర్ గ్రూప్‌లో అవకతవకల కేసులో తనిఖీలు

    • విశాఖ వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా విజయప్రసాద్

  • Aug 05, 2026 09:28 IST

    కర్ణాటకలో రసాయన వాయువు పీల్చి ముగ్గురి మృతి

    • మరో ముగ్గురి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు

    • యాద్గిర్ మండలం కడేచూరు పరిశ్రమలో ఘటన

    • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 05, 2026 09:23 IST

    హైదరాబాద్: కల్తీ మసాలా దినుసుల అంశంపై సిట్ ఏర్పాటు

    • నిందితులపై BNS 110 సెక్షన్ల కింద కేసులు నమోదు

    • నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేయాలని నిర్ణయం

    • పీఎస్‌లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టనున్న సిట్

    • మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌లో 2, బాలాపూర్ పీఎస్‌లో ఒక కేసు నమోదు

  • Aug 05, 2026 08:47 IST

    ట్రంప్ గోల్ఫ్ కోర్స్ వద్ద సాయుధుడి అరెస్టు

    • కాలిఫోర్నియాలోని గోల్ఫ్ కోర్స్ వద్ద ఆయుధంతో చిక్కిన నిందితుడు

    • అతడి వద్ద తుటాలు, తుపాకీని గుర్తించిన పోలీసులు

    • నిందితుడి నివాసంలోనూ పలు ఆయుధాలు లభ్యం

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 08:42 IST

    కర్నూలు: ఆదోని మండలం పాండవగల్లు కొండల్లో చిరుత కలకలం

    • గ్రామ సమీపంలోని కొండ ప్రాంతాల్లో చిరుత సంచారం

    • రాత్రి వేళల్లో బయటకు వెళ్లొద్దని ప్రజలకు అటవీశాఖ హెచ్చరిక

  • Aug 05, 2026 08:41 IST

    కామారెడ్డి: లింగంపేట్ మండలం రాంపల్లి కోనతండాలో విషాదం

    • పొలం పనుల కోసం వెళ్లిన దేవసోత్ శ్రీహరి గల్లంతు

    • పెద్దవాగు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన శ్రీహరి

    • శ్రీహరి కోసం గాలిస్తున్న రెస్క్యూ బృందం

  • Aug 05, 2026 08:40 IST

    కామారెడ్డి: నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టుకు జలకళ

    • పూర్తి స్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారిన పోచారం

    • 1464 అడుగుల వద్ద 1.820 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వలు

    • ఇన్ ఫ్లో 2200 క్యూసెక్కులు.. ఓవర్ ఫ్లో అవుతోన్న అదనపు జలాలు

    • నిజాంసాగర్‌లోకి వెళ్తున్న వరద నీరు

  • Aug 05, 2026 07:45 IST

    అమరావతి: అగ్రిగోల్డ్‌పై నేడు జీవోఎం భేటీ

    • హోంమంత్రి అనిత అధ్యక్షతన సమావేశం

    • ఆస్తుల వేలం పురోగతి, కోర్టు కేసుల పరిష్కారంపై చర్చ

  • Aug 05, 2026 07:45 IST

    నేడు గాంధీభవన్‌లో ప్రజలతో మంత్రి సీతక్క ముఖాముఖి

    • ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించనున్న మంత్రి

    • ఉదయం 11గంటల నుంచి రెండు గంటల పాటు కార్యక్రమం

  • Aug 05, 2026 06:50 IST

    న్యూఢిల్లి: నేడు పార్లమెంట్‌లో విపక్ష ఎంపీల నిరసన ప్రదర్శన

    • గాంధీ విగ్రహం నుంచి మకర్‌ద్వార్‌ వరకూ మార్చ్

    • విద్యార్థుల మీద పోలీసుల దాడులపై హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్‌

    • అయోధ్య విరాళాలపై పార్లమెంట్‌లో చర్చకు పట్టు

    • జమ్మూకశ్మీర్‌‌కు రాష్ట్ర హోదా కల్పించాలని మరో డిమాండ్‌

  • Aug 05, 2026 06:48 IST

    నిజామాబాద్‌: SRSP ఇన్‌ఫ్లో 30 వేల క్యూసెక్కులు

    • ఔట్‌ ఫ్లో వెయ్యి క్యూసెక్కులు

    • పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 80 టీఎంసీలు

    • ప్రస్తుత నీటిమట్టం 35.537 టీఎంసీలు

  • Aug 05, 2026 06:48 IST

    తూ.గో. జిల్లా: నేడు దేవరపల్లిలో జగన్‌ పర్యటన

    • పొగాకు రైతులతో జగన్‌ ముఖాముఖి

  • Aug 05, 2026 06:47 IST

    నేడు CJP అభిజిత్‌ నివాసంలో కీలక సమావేశం

    • CJP భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

    • రెండో రోజుల పాటు జరగనున్న చర్చలు

  • Aug 05, 2026 06:47 IST

    హైదరాబాద్‌లో రెండో రోజు బ్రిక్స్‌ దేశాల సమావేశం

    • నేడు టెక్నాలజీ ఆధారిత నైతిక పరిపాలనపై సదస్సు

  • Aug 05, 2026 06:46 IST

    నేటి నుంచి తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

    • తొలి బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్న సీఎం విజయ్‌ సర్కార్‌

    • బడ్జెట్‌ సమయంలో ఉదయనిధి అరెస్ట్‌పై DMK ఆగ్రహం

  • Aug 05, 2026 06:46 IST

    నేడు నిజామాబాద్‌లో మహేశ్ గౌడ్‌ పర్యటన

    • పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న TPCC చీఫ్‌

  • Aug 05, 2026 06:10 IST

    తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు

    • నేడు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

    • ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ కేంద్రం

  • Aug 05, 2026 06:10 IST

    తెలంగాణలో ఇకపై మండల స్థాయిలో ప్రజావాణి

    • ప్రతి సోమవారం మండలాల్లో చేపట్టాలని ఉత్తర్వులు

    • ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్ణయం

  • Aug 05, 2026 06:09 IST

    శ్రీలంకలో భారీ వర్షాల బీభత్సం

    • వరదలతో పాటూ కొండచరియలు విరిగిపడి ఏడుగురి మృతి

    • పలు ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు, రోడ్లు జలమయం

    • కుండపోత వర్షాలకు ధ్వంసమైన 291 ఇళ్లు

    • 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

    • విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన అధికారులు

    • వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు

  • Aug 05, 2026 06:07 IST

    ఢిల్లి: నేడు కేంద్రమంత్రులను కలవనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

    • కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్‌, సీఆర్‌ పాటిల్‌తో భేటీకానున్న సీఎం రేవంత్‌

    • తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చ

  • Aug 05, 2026 06:06 IST

    నేడు విశాఖ, అమరావతిలో మంత్రి నారా లోకేశ్ పర్యటన

    • ఉదయం అరిలోవలో పీవీ సింధు అకాడమీ పనులకు శంకుస్థాపన

    • మధ్యాహ్నం ఇసుకతోటలో ఐబీఎం ఫ్యూచర్‌నౌ సెంటర్ ప్రారంభం

    • సాయంత్రం అమరావతిలో అమృత వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరు

  • Aug 05, 2026 06:05 IST

    ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి

    • యెమెన్‌ జలాల సమీపంలో దాడి

    • నీట మునిగిన MSV ఫైజ్‌ నూరే ఓలియా షిప్‌

    • నౌకలోని 13 మంది భారతీయ సిబ్బంది సహా ఓ విదేశీయుడిని కాపాడిన యెమెన్‌ తీర రక్షక దళం

    • నౌకపై దాడిని ఖండించిన భారత విదేశాంగ శాఖ

    పూర్తి కథనం..

  • Aug 05, 2026 06:05 IST

    నేటి నుంచి ఏపీ టెట్‌ నిర్వహణ

    • ఈ నెల 24న కీ, సెప్టెంబర్‌ 15న ఫలితాలు

    • రాష్ట్ర వ్యాప్తంగా 2.14 లక్షల మంది దరఖాస్తు