వ్యాపారిని వెంటాడిన డ్రోన్.. వద్దని వేడుకున్నా కనికరం లేకుండా.. షాకింగ్ వీడియో
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:20 PM
ఉక్రెయిన్‌లో ఓ సామాన్య పౌరుడిని వెంటాడి దాడి చేసిన డ్రోన్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా ఈ వీడియోను షేర్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: డ్రోన్‌లతో చేసే యుద్ధాల్లో ఎంతటి దారుణాలు జరుగుతాయో చెప్పే షాకింగ్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఓ సామాన్య పౌరుడిని రష్యన్ డ్రోన్ వెంటాడి దాడి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ దారుణ ఘటనలు అందరికీ తెలియాలని కామెంట్ చేశారు.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఖెర్సన్ ప్రాంతంలో రష్యా దాడుల సందర్భంగా ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా కూరగాయలు అమ్ముకునే ఓ వ్యాపారిని రష్యా డ్రోన్ టార్గెట్ చేసింది. డ్రోన్‌ను చూడగానే ఆ వ్యాపారి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశాడు. తనను వదిలేయాలని చేతులెత్తి దండం పెట్టాడు. డ్రోన్ నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలో తోచక అక్కడే ఉన్న కారు చుట్టూ చక్కర్లు కొట్టాడు. రష్యా సైనికులు నియంత్రిస్తున్న డ్రోన్ మాత్రం అతడిని వెంటాడింది. తనను వదిలేయాలని అతడు వేడుకున్నా కనికరించలేదు. ఆ తరువాత డ్రోన్ అతడికి సమీపంలో పేలిపోయింది. ఈ ఘటనలో అతడికి ప్రాణాపాయం తప్పినా గాయాలపాలైనట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం అతడు షాక్‌లో ఉన్నట్టు తెలిసింది.
ఈ దారుణాలు ప్రపంచానికి తెలియాలి: జెలెన్‌స్కీ
రష్యా తరచూ డ్రోన్‌లతో సఫారీ దాడులు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. సామాన్య పౌరులను రష్యా టార్గెట్ చేస్తోందనేందుకు ఇదే ఆధారమని అన్నారు. ఈ వీడియో గురించి అందరికీ తెలియాలని కామెంట్ చేశారు. ఇలాంటి డ్రోన్స్‌ను రష్యా సైనికులు సుదూరం నుంచి రిమోట్‌గా నియంత్రిస్తుంటారు. యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకు సమీపంలోని సామాన్య పౌరులను భయభ్రాంతులకు గురి చేసేందుకు రష్యా వీటిని ప్రయోగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇది అనాగరిక యుద్ధ చర్య అని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి ఆరోపించారు.
ఈ వార్తలనూ చదవండి:
సీక్రెట్ మీటింగ్‌లో అవమానం.. ఇరాన్ సుప్రీం లీడర్, అధ్యక్షుడి మధ్య మరింత పెరిగిన ఎడం?
దుబాయ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. 20 నిమిషాల్లో 7 సార్లు పేలుళ్లు..