Share News

జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: మోదీ

ABN , Publish Date - Aug 05 , 2026 | 01:24 PM

జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: మోదీ
PM Narendra Modi

ఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఆర్టికల్స్ 370, 35(A) రద్దుతో కొత్త అధ్యాయం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.


జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. విద్య, వైద్యం, క్రీడలు, పారిశ్రామిక రంగాల్లో అవకాశాలు పెరిగాయని చెప్పుకొచ్చారు. మహిళలు, అణగారిన వర్గాలకు పూర్తిగా రాజ్యాంగ హక్కులు కల్పిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి నేడు. ఈ సందర్భంగా నివాళి అర్పించి వారిని స్మరించుకున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ప్రధాని పోస్టు పెట్టారు


వార్తలు కూడా చదవండి...

మెటాపై కేసు నమోదు చేసిన ఆ డీసీపీని.. రేవంత్‌రెడ్డి బదిలీ చేశారు: కిషన్‌రెడ్డి

తెలంగాణలో అగమ్యగోచరంగా ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి: హరీశ్‌రావు

మెటాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 05 , 2026 | 01:37 PM