Share News

గంజాయి చాక్లెట్ల విక్రయం.. బిహార్‌కు చెందిన రంజిత్ కుమార్ అరెస్ట్

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:23 AM

దుండిగల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బిహార్‌కు చెందిన రంజిత్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గంజాయి చాక్లెట్ల విక్రయం.. బిహార్‌కు చెందిన రంజిత్ కుమార్ అరెస్ట్
Ganja Chocolates

హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): దుండిగల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బిహార్‌కు చెందిన రంజిత్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పక్కా సమాచారంతో దుండిగల్ తండా-2లో తనిఖీలు చేశారు. నిందితుడి దగ్గరి నుంచి 350 గ్రాముల 71 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.


కాజీపల్లిలోని కంపెనీలో లేబర్‌గా పనిచేస్తూ దుండిగల్ తండా-2లో నిందితుడు రంజిత్ కుమార్ నివాసం ఉంటునట్లు పోలీసులు వెల్లడించారు. బిహార్‌లోని తన అత్తగారి ఊరి నుంచి గంజాయి చాక్లెట్లను కొనుగోలు చేసి తీసుకువచ్చినట్లు తెలిపారు. తండాలోని స్థానిక కార్మికులకు, లేబర్లకు గంజాయి చాక్లెట్లను అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


వార్తలు కూడా చదవండి...

మెటాపై కేసు నమోదు చేసిన ఆ డీసీపీని.. రేవంత్‌రెడ్డి బదిలీ చేశారు: కిషన్‌రెడ్డి

తెలంగాణలో అగమ్యగోచరంగా ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి: హరీశ్‌రావు

మెటాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 05 , 2026 | 11:55 AM