వడ్డీ రేట్లు యథాతథం.. ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్
ABN , Publish Date - Aug 05 , 2026 | 10:34 AM
దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసే కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసే కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించింది. ద్రవ్య పరపతి సమీక్ష అనంతరం మనుపుటి వడ్డీ రేట్లను కొనసాగిస్తున్న విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. ప్రస్తుత రెపో రేటును 5.25 శాతం వద్ద కొనసాగించేందుకు కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎస్‌డీఎఫ్ 5 శాతంగా, ఎమ్ఎస్ఎఫ్, బ్యాంక్ రేటు 5.5 శాతంగా కొనసాగిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నడుమ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు ఆర్బీఐ మొగ్గు చూపుతుందన్న విశ్లేషణలు ఇప్పటికే వచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రికత్తలు భారత్ ఆర్థికాభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే విషయాన్ని ఆర్థికవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గడంతో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నాటి సమీక్షల్లో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు ఆర్బీఐ నిర్ణయించింది. గతేడాది మాత్రం పలుమార్లు రేట్లను సవరించింది.
ఈ వార్తలనూ చదవండి:
తగ్గిన పసిడి.. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఇవీ
టాక్సేషన్ చట్టాల (సవరణ) బిల్లు.. విదేశీ పెట్టుబడులకు మరింత ఊతం