Share News

రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:10 AM

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు ఎనిమిది ప్రైవేటు కాలేజీలు.. రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫైర్ ఎన్‌వోసీలను(NOC) సృష్టించిన కళాశాలలు.. వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి.

రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు
Ranganath Signature Forgery

హైదరాబాద్, ఆగస్టు 5: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు ఎనిమిది ప్రైవేటు కాలేజీలు.. రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫైర్ ఎన్‌వోసీలను(NOC) సృష్టించిన కళాశాలలు.. వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. ఈ విషయం గుర్తించిన అధికారులు దీనిపై విచారణ చేపట్టగా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. దీంతో నకిలీ పత్రాలు సమర్పించిన ఎనిమిది ప్రైవేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఫోర్జరీ, నకిలీ పత్రాల సృష్టి తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


అలాగే, మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకాలను కూడా ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఫోర్జరీ చేశాయి. నాగిరెడ్డి సంతకాలతో NOC పత్రాలు సృష్టించాయి. అయితే నాగిరెడ్డి స్థానంలో కొత్త ఫైర్ డీజీ రావడంతో ఈ వ్యవహారం బయటపడింది. నాగిరెడ్డి లేకపోయినప్పటికీ అతని పేరుతో సంతకాలు రావడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు.

నకిలీ ఎన్‌వోసీలు ఇచ్చిన ఎనిమిది కాలేజీలు..

  • కైట్స్ జూనియర్ కాలేజీ - ఓల్డ్ బోయిన్‌పల్లి

  • విజ్ఞాన్ భారతి జూనియర్ కాలేజీ - యాప్రాల్‌

  • శ్రీ అభ్యాస్ జూనియర్ కాలేజీ - అల్వాల్

  • సీఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజీ - ఈసీఐఎల్

  • ఎక్స్‌లెన్సియా జూనియర్ కాలేజీ - పేట్ బషీరాబాద్

  • శ్రీ నారాయణ కాలేజ్ ఆఫ్ కామర్స్ - ఉప్పల్

  • ఎక్స్‌లెన్సియా జూనియర్ కాలేజీ - దమ్మాయిగూడ

  • కెరీర్ పాయింట్ జూనియర్ కాలేజీ - పేట్ బషీరాబాద్‌


ఇవి కూడా చదవండి...

ఆదోనిలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు

విశాఖ వైసీపీ నేత విజయ ప్రసాద్‌పై ఈడీ ఫోకస్.. ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2026 | 04:10 PM