పీవీ సింధు అకాడమీ పనులకు భూమిపూజ చేసిన మంత్రి లోకేశ్
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:30 AM
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు సంబంధించిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు.
విశాఖపట్నం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): భారతదేశ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ఈరోజు (బుధవారం) భూమిపూజ చేశారు. ముందుగా తోటగరువులోని అకాడమీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు.. పీవీ సింధు, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పీవీ సింధు, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని లోకేశ్ ఆవిష్కరించారు. అకాడమీ భవన నమూనాతో పాటు క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక సౌకర్యాలు, వసతుల గురించి మంత్రి లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. అకాడమీపై రూపొందించిన ఏవీని వీక్షించారు. అందరితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, శాప్ ఎండీ ఎస్.భరణి, గ్రీన్ కో ఎనర్జీ ఎఫీషియన్సీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ చలమలశెట్టి స్వాతి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు కూడా చదవండి...
అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు.. ఆ ల్యాండ్స్‌ను మానిటైజ్ చేస్తాం: సీఎం చంద్రబాబు
జల్ జీవన్ పనుల్లో వేగం పెంచాలి: పవన్ కల్యాణ్
లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలి.. వైసీపీపై మంత్రి అనగాని ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News