అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు.. ఆ ల్యాండ్స్‌ను మానిటైజ్ చేస్తాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 04 , 2026 | 02:24 PM
అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి ల్యాండ్స్‌ను మానిటైజ్ చేస్తామని స్పష్టం చేశారు.
అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. అమరావతి ల్యాండ్స్‌ను మానిటైజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు (మంగళవారం) ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. అమరావతిలో వివిధ రంగాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారని పేర్కొన్నారు. క్వాంటం వ్యాలీ గత డిసెంబర్‌లో ప్రారంభించామని వెల్లడించారు. 2028లో అమరావతి ఫేజ్ -1 ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఏపీకి లైఫ్ లైన్ అని ఉద్ఘాటించారు. హెచ్ఆర్ వ్యయం నేటికి 98 శాతం అయిందని వివరించారు. వివిధ రాష్ట్రాల్లోని గణాంకాల గురించి అధికారులకు సీఎం వివరించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్‌లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలను తాను అభివృద్ధి చేశానని పేర్కొన్నారు.
సూర్యలంక టూరిజం ప్రాంతంగా మారుతుంది..
సూర్యలంక గోవాకంటే మంచి టూరిజం ప్రాంతంగా మారుతుందని సీఎం చంద్రబాబు వివరించారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వచ్చినట్లే.. రాయలసీమ రాయల్‌గా మారుతుందని ఆకాంక్షించారు. ఇండియా ఎమర్జింగ్ నాలెడ్జ్ , సిమెంట్, స్టీల్, స్పెస్ సిటీ, డ్రోన్‌ల వంటి వాటిపై దృష్టిపెట్టామని వెల్లడించారు. స్వర్ణగిరి అశోకాకు 4వ రాజధానిగా పనిచేసిందని తెలిపారు. ఇప్పుడు జొన్నగిరిని స్వర్ణగిరిగా మార్చామని తెలిపారు. గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. దీనికోసం ప్రభుత్వ - ప్రైవేటు సపోర్టుతో లక్ష కోట్లకోసం ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కాకుండా.. ఏపీ వన్ అనే యాప్‌ను కూడా సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్రంలో నీటి శాతాన్ని మానిటర్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
పీపీపీ ఒక రియాలిటీ..
పీపీపీ ఒక రియాలిటీ అని.. 390 ప్రాజెక్టులను పీపీపీ కింద కొనసాగిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక్కడ పీపీపీ వద్దంటారని... భోగాపురం విమానాశ్రయం మాత్రం తమది అని వైసీపీ నేతలు చెబుతారన్నారు. భోగాపురం పీపీపీలో నిర్మించలేదా..? అని ప్రశ్నించారు. స్వయం బ్రాండ్ ద్వారా 60 అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా దీనిని ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు. ఏపీలో ఎస్‌హెచ్‌జీ డిజిటలైజేషన్ పూర్తి అయిపోయిందని తెలిపారు. భారతదేశానికి అనేక సమస్యలు ఉన్నాయన్నారు. జేగురుపాడు ప్రాజెక్టు లీజు పూర్తి అవడంతో ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారని తెలిపారు. నెల్లూరు, తిరుపతి గోల్డెన్ క్వార్డర్లేటర్ విధానంలో పీపీపీ మోడ్‌లో అభివృద్ధి చేశామని వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్, చిత్తూరు, చెన్నై కనెక్టింగ్ సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు.
పీ3 దేశానికి సంపద తెచ్చింది..
పీ3 దేశానికి సంపద తెచ్చిందని.. ఇప్పుడు తాము పీ4 అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. పీ4 కింద 2లక్షల 40వేల మందికి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇది గేమ్‌ఛేంజర్ అవుతుందని తెలిపారు. తద్వారా హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాకారమవుతుందని ఉద్ఘాటించారు. వేల్పేర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి వారికి ఎంపవర్‌మెంట్‌కు ఉపయోగిస్తున్నామని వివరించారు. వారి పిల్లలను ఉన్నత చదువులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. బీసీలకు 118లక్షల లబ్ధిదారులకు న్యాయం చేశామని స్పష్టం చేశారు. లిక్కర్ షాపులు, గనుల కేటాయంపుల్లో ప్రాధాన్యం కల్పించామని చెప్పుకొచ్చారు. మైనార్టీల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్‌లు డిఫెక్ట్ అయ్యాయని పేర్కొన్నారు.
వ్యవసాయం నుంచి 34శాతం ఆదాయం..
ఏపీకి 34శాతం ఆదాయం వ్యవసాయం నుంచి వస్తోందని.. లైవ్ స్టాక్, ఆక్వా నుంచి ఆదాయం వస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్యాడీ నుంచి వచ్చే ఆదాయం తక్కువ అని చెప్పుకొచ్చారు. అవసరమైన చోట ప్రకృతి సేద్యానికి వెళ్లాలని చెబుతున్నామని అన్నారు. 20 లక్షల ఎకరాలు న్యాచురల్ ఫార్మింగ్ కింద మనం చేస్తున్నామని వివరించారు. దీనికి సంబంధించి అవార్డు కూడా వచ్చిందని ప్రస్తావించారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా సరైన నాయకత్వం లేదని.. కేవలం ఇండియాలోనే మాత్రమే ఉందని తెలిపారు. ఎల్‌నినో లాంటివి వచ్చినా నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
లీడర్ బావుంటేనే అభివృద్ధి..
లీడర్ షిప్ అనేది ప్రతి పార్ట్‌లో అవసరమని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. లీడర్ బావుంటేనే అభివృద్ధి జరుగుతుందని.. బాగోపోతే విధ్వంసం జరగుతుందని తెలిపారు. ఈ రెండేళ్లలో ఏపీని తాను ఎంతో అభివృద్ధి చేశానని వెల్లడించారు. ఎన్నడూ లేనంతగా తాను కష్టపడుతున్నానని చెప్పుకొచ్చారు. వెంటిలేటర్‌పై ఉండే ఆర్థిక వ్యవస్ధను కేంద్రం సాయంతో బతికించుకోగలిగామని ఉద్ఘాటించారు. ప్రజలు 2024లో ఇచ్చిన విజ్ డమ్ ఆంధ్రప్రదేశ్‌కు బ్రహ్మాస్త్రంగా మారిందని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఏపీ అభివృద్ధికి అన్నివిధాలా సహకరించారని.. ప్రజలు కూడా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఉత్తరాంధ్రాను అభివృద్ధి చేస్తున్నాం..
ఉత్తరాంధ్ర అభివృద్ధి కాదని వైసీపీ హయాంలో వదిలేశారని.. కానీ అక్కడే అభివృద్ధి చేసి చూపిస్తున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. కొందరు డేటాసెంటర్ గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. పీపీపీ మోడ్‌లో ఆయా ప్రాజెక్టులు నిర్మిస్తే వద్దని చెబితే ఎలా అని ప్రశ్నించారు. విదేశాల్లో సాంకేతికతకు ఆయువుపట్టు లాంటి వ్యాలీలు వస్తుంటే ఎందుకు ఇండియాలో రాకూడదని ప్రశ్నించారు. వేల్పేర్ ఇవ్వాలనే వారు అభివృద్ధి గురించి పట్టించుకోవాలని.. ప్రజలు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలని సూచించారు. అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం ఏంటో కూడా ఆలోచించాలని అన్నారు. ప్రతిసంవత్సరం ఇలా ప్రజల ముందు ఉంచుతానని అన్నారు. దీనిపై చర్చ జరగాలని తెలిపారు. ప్రతి ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి అవుతుందనేది టైం లైన్ పెట్టి చెబుతామని స్పష్టం చేశారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌లో 49 ప్రాజెక్టుల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడి పెడితే 24 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పుకొచ్చారు. ఇండియాలో అత్యంత వేగంగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని వివరించారు.
గొడ్డలి పార్టీకి నేరాలు చేయడం అలవాటు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై.. సీఎం చంద్రబాబు పరోక్షంగా సెటైర్లు వేశారు. గొడ్డలి పార్టీకి నేరాలు చేయడం అలవాటైందని ఎద్దేవా చేశారు. సీసీటీవీ ఫుటేజ్ సమీపంలో నేరాలు చేసి గొడ్డలి పార్టీ నేతలు దొరికి పోతున్నారని వ్యగ్యంగా మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు చివరకు ఆర్టీజీఎస్‌ను కూడా సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. వ్యవస్థలు అన్నింటిని సర్వనాశనం చేశారని ఆగ్రహించారు. డెఫిసిట్ ఫైనాన్స్‌ను కూడా 2026 వరకు వాడాల్సిన మొత్తాన్ని 2024లోనే వైసీపీ హయాంలో వాడారని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు చేస్తున్న నేరాలను తాము అడ్డుకుంటున్నామని.. వారి అరాచకాలను సాగనీవబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
వార్తలు కూడా చదవండి...
డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
కామన్వెల్త్ గేమ్స్ అద్భుతంగా ముగిశాయి: పవన్ కల్యాణ్
అభివృద్ధి కార్యక్రమాలు జగన్‌కు నచ్చవు: ఎంపీ కలిశెట్టి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News