డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 03 , 2026 | 04:37 PM
అన్ని శాఖల్లో డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అన్ని శాఖల్లో డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్‌టీజీఎస్‌లో డేటా ఆధారిత నిర్ణయాలపై సీఎం చంద్రబాబు ఈరోజు (సోమవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. Data Driven Decision Makingపై అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. సీఎం సమీక్షకు ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఐటీ, ఆర్‌టీజీఎస్, వ్యవసాయం, మున్సిపల్, సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆర్‌టీజీ ద్వారా పాలన మరింత సమర్థవంతంగా, సులభంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాలతో డేటా వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ఆయా శాఖల వారీగా డేటా సమన్వయంపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు.
వార్తలు కూడా చదవండి...
కేంద్ర పన్నుల వాటాతో ఏపీ అభివృద్ధి మరింత వేగవంతం: సీఎం చంద్రబాబు
డ్రగ్స్ రహిత ఏపీ కోసం కృషి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్
పొగాకు రైతులకు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News