కేంద్ర పన్నుల వాటాతో ఏపీ అభివృద్ధి మరింత వేగవంతం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:02 PM
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సకాలంలో పన్నుల వాటా కేటాయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
అమరావతి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి సకాలంలో పన్నుల వాటా కేటాయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటా కేటాయించారని వెల్లడించారు.
రాష్ట్ర పన్నుల వాటాను కేంద్రప్రభుత్వం సకాలంలో కేటాయించడంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అదనపు పన్నుల వాటా విడుదలతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాల అమలు మరింత వేగవంతం అవుతున్నాయని ఉద్ఘాటించారు. కేంద్రప్రభుత్వం ఏపీ అభివృద్ధికి నిరంతరం అందిస్తున్న సహకారం రాష్ట్ర పురోగతికి ఎంతగానో దోహదపడుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇచ్చారు: సీఎం చంద్రబాబు
నమో సహకారంతోనే ఏపీలో అనేక అభివృద్ధి పనులు: మంత్రి లోకేశ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News