భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Aug 01 , 2026 | 11:36 AM
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
విజయనగరం జిల్లా, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఈరోజు (శనివారం) ప్రారంభించారు. విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు ఉన్నారు. రూ.4,727 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనంలోని ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్‌ను ప్రధాని పరిశీలించారు.
ఈ వీడియో వాల్‌లో ప్రదర్శించిన వివిధ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర చరిత్రాక అంశాలను ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. విమానాశ్రయ ప్రాంగణంలోని వివిధ కళాకృతులను మోదీ ఆసక్తిగా పరిశీలించారు. టెర్మినల్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, GMR ప్రతినిధులు ఫొటో దిగారు. ఓపెన్ టాప్ జీపులో వెళ్తూ 13,500 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన థింసా నృత్యాన్ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వీక్షించారు. ఓపెన్ టాప్ జీపులోనే సభా వేదిక వద్దకు నేతలు వెళ్లారు. బహిరంగ సభావేదికపై ప్రధాని మోదీకి బొబ్బిలి వీణను సీఎం చంద్రబాబు బహూకరించారు. ఈ వేదికపై ప్రధాని మోదీని పొందూరు ఖాదీ కండువాతో సీఎం చంద్రబాబు సత్కరించారు.
వార్తలు కూడా చదవండి...
భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు
పవన్ కల్యాణ్ ఆదేశాలతో కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు
ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ఉన్నతాధికారుల సమీక్ష
Read Latest AP News And Telangana News And National News
And Telugu News