Share News

ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ఉన్నతాధికారుల సమీక్ష

ABN , Publish Date - Jul 31 , 2026 | 07:41 PM

ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవాళ ఏపీఎస్‌డీఎంఏ కార్యాలయాన్ని ఎన్డీఎంఏ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సందర్శించింది.

ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ఉన్నతాధికారుల సమీక్ష
National Disaster Management Authority

అమరావతి, జులై 31 (ఆంధ్రజ్యోతి): ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈరోజు (శుక్రవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవాళ ఏపీఎస్‌డీఎంఏ కార్యాలయాన్ని ఎన్డీఎంఏ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సందర్శించింది. విపత్తుల ముందస్తు సన్నద్ధత బలోపేతంపై కేంద్ర ప్రభుత్వ అధికారులు సమీక్షించారు. వడగాలులు, పిడుగుపాట్ల నివారణ కార్యాచరణపై ఏపీ అధికారులతో చర్చించారు.


ఎస్‌డీఆర్‌ఎఫ్ బెటాలియన్ల సామర్థ్య పెంపుపై కేంద్ర బృందం దృష్టిసారించినట్లు అధికారులు తెలిపారు. ఆధునిక పరికరాల సమీకరణ, అగ్నిమాపక సేవల విస్తరణపై సమీక్షించారు. ఏపీ, జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళికల నవీకరణపై ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు మాట్లాడారు. అలాగే, ఎన్‌డీఎంఐఎస్ పోర్టల్‌లో సమాచార నమోదు తీరును పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఐడీఆర్‌ఎన్ పోర్టల్ వినియోగంపై కీలకంగా చర్చించారు.


జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విపత్తు నిర్వహణ బలోపేతమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విపత్తు నిర్వహణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని అన్నారు. ప్రజలకు వేగవంతమైన విపత్తు సేవలందించేందుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఏపీలో పర్యటించామని వెల్లడించారు. విపత్తుల నిర్వహణలో సాంకేతికత వినియోగం పెంపుపై కార్యాచరణ చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 08:22 PM