Share News

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:25 PM

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం..  వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు
Sai Krishna Lockup Death Case

ఢిల్లీ, జులై 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు (Sai Krishna Lockup Death Case) దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈరోజు (గురువారం) విజయవాడ కోర్టులో హాజరుపరిచింది. కస్టడీ విచారణకు సంబంధించి ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో నాగరాజు ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.


మాజీ సీఐ నాగరాజును ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సిట్ అధికారులు విచారించాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయం ముగిసిన తర్వాత కూడా నాగరాజుకు భద్రత కల్పించాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది.


కోర్టు అనుమతి అనంతరం మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని సిట్ కార్యాలయానికి తరలించనున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నాగరాజును వారం రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారించనున్నారు.

ఈ కేసు విచారణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ మొత్తం ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని సిట్ అధికారులను ఆదేశించింది. అలాగే విచారణ సమయంలో చట్టపరమైన నిబంధనలు పూర్తిగా పాటించాలని సూచించింది.

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఏపీవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో సిట్ దర్యాప్తుపై అందరి దృష్టి నెలకొంది. కస్టడీ విచారణలో వెలుగులోకి వచ్చే వివరాలు ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది.


వార్తలు కూడా చదవండి...

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్

ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 01:17 PM