Share News

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:58 PM

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్
Pawan Kalyan

అమరావతి, జులై 29 (ఆంధ్రజ్యోతి): జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. అడవుల పరిరక్షణలో భాగస్వాములైన ప్రకృతి ప్రేమికులందరికీ అంతర్జాతీయ పులుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పులుల సంరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీని నిలిపామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. తూర్పు కనుమల్లో పులుల పునరుజ్జీవం వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు.


75 శాతం మన దేశంలో పులులు నివసిస్తున్నాయి..

నల్లమలలో పులి గర్జన శాశ్వతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పులి కేవలం మన జాతీయ జంతువు మాత్రమే కాదని, మన దేశ అటవీ సంపదకు, జీవ వైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు ప్రతీక అని ఉద్ఘాటించారు. ప్రపంచ పులుల దినోత్సవం… 2010లో పులుల సంరక్షణ కోసం అంతర్జాతీయ సమాజం తీసుకున్న సంకల్పాన్ని మనకు గుర్తు చేస్తుందని తెలిపారు. అదే సమయంలో పులుల పరిరక్షణలో మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన తీరును గుర్తు చేస్తుందని అన్నారు. ‘ప్రాజెక్ట్ టైగర్’ వంటి దూరదృష్టితో కూడిన కార్యక్రమాల ఫలితంగా నేడు ప్రపంచంలోని పులుల్లో దాదాపు 75 శాతం మన దేశంలో నివసిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇది భారతదేశం సాధించిన అపూర్వ పర్యావరణ విజయానికి నిదర్శనమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మా ఇంట్లో రెండు పార్టీలు: భువనేశ్వరి

సూర్యుడు.. మేడిన్‌ చైనా!

ఎర్రబస్సూ రాదన్నారు.. ఎయిర్‌బస్సు వచ్చేస్తోంది!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 01:14 PM