Share News

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి

ABN , Publish Date - Jul 29 , 2026 | 11:55 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలో ఈరోజు పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి
Nara Bhuvaneswari

చిత్తూరు జిల్లా, జులై 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneswari) చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలో ఈరోజు (బుధవారం) పర్యటించారు. కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె.. బంగారునాత్తం వద్ద హార్టికల్చర్ హాబ్‌ని పరిశీలించారు. నూతన వంగడాలు, సాగు విధానాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.


మహిళా రైతులతో భువనేశ్వరి ముఖాముఖి సమావేశం..

మహిళా రైతులతో భువనేశ్వరి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఆయా పంటలు సాగు చేస్తున్న విధానాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే నూతన పంట విధానాలను అవలంభించాలని సూచించారు. లాభసాటి వ్యవసాయం చేసేందుకు ఒకే పంటపై ఆధారపడకుండా కొత్త రకాల పంటలు పండించే విధంగా రైతన్నలు మొగ్గుచూపాలని తెలిపారు.


మూడోరోజు కుప్పంలో విస్తృతంగా పర్యటన..

కుప్పంలో మూడోరోజు విస్తృతంగా నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉదయం 10 గంటలకు బంగారు నత్తం వద్ద సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని సందర్శించారు. ఉదయం 11 గంటలకు వసనాడు వద్ద మహిళల ముఖాముఖిలో పాల్గొన్నారు. అలాగే, జిల్లా పరిషత్ పాఠశాలల్లో మొక్కలు నాటుతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బాబూనగర్‌‌లోని దాసమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొంటారు. మూడుగంటల నుంచి 4 గంటల వరకు వెవూరులో మహిళలతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గరిగ చీనేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో భువనేశ్వరి సమావేశమై పలు విషయాలపై చర్చిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మా ఇంట్లో రెండు పార్టీలు: భువనేశ్వరి

సూర్యుడు.. మేడిన్‌ చైనా!

ఎర్రబస్సూ రాదన్నారు.. ఎయిర్‌బస్సు వచ్చేస్తోంది!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 12:37 PM