Share News

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ

ABN , Publish Date - Jul 30 , 2026 | 11:38 AM

కియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.12 కోట్లతో పెనుకొండలో ఐటీఐ కళాశాల నిర్మాణానికి కియాతో ఒప్పందం చేసుకుంది.

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ
Kia MoU

శ్రీసత్యసాయి జిల్లా, జులై 30 (ఆంధ్రజ్యోతి): కియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.12 కోట్లతో పెనుకొండలో ఐటీఐ కళాశాల నిర్మాణానికి కియాతో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఏపీ మంత్రి సవిత సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రతాలను కియా సీఈవో కిమ్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మార్చుకున్నారు. రెండు ఎకరాల్లో ఐటీఐ కళాశాల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. ఐటీఐ కళాశాల నిర్మాణంతో కియాకు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత తీరనుందని తెలిపారు.


పరిశ్రమల రాకతో ఏపీ ముఖ చిత్రం మారుతోంది..

జీఎస్టీ రూపంలో ఏటా రూ.3,600 కోట్లు కియా నుంచి వస్తుందని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆయా పరిశ్రమల రాకతో అభివృద్ధి, ఉపాధితో పాటు సీఎస్ఆర్ నిధులను సమకూరుస్తున్నట్లు వెల్లడించారు. సీఎస్ఆర్ నిధులతో మౌలిక వసతుల అభివృద్దికి వీలు కలుగుతుందని చెప్పుకొచ్చారు. పెనుకొండ నియోజకవర్గంలో రూ.36 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలు జరుగుతాయని వెల్లడించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కృషితో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, పరిశ్రమల రాకతో ఏపీ ముఖ చిత్రం మారుతోందని మంత్రి సవిత పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్

ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 12:46 PM